Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Dhanur Rasi / Sagittarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం- 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 07, అవమానం - 05

  • పూర్వ పద్దతి లో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఏర్పడబోతున్న విజయవంతం అయిన జీవనాన్ని సూచిస్తుంది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Dhanur Rasi / Sagittarius's Sign Nature...

ధనుర్ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా గత సంవత్సరం మాదిరిగానే అతి చక్కటి ఫలితాలు ఏర్పడుతాయి. నూతన శాస్త్ర సాంకేతికను అభ్యసిస్తారు. కుటుంబానికి గృహ లేదా భూ సంపదను ఏర్పాటు చేయ గలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగ అన్వేషకులకు ఈ సంవత్సరం కూడా తప్పక ప్రభుత్వ కొలువు లభిస్తుంది. ఈశ్వర ఉపాసన సకల లాభములను కలుగ చేస్తుంది. ధనుర్ రాశి వారికి గురువు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా అఖండమైన అనుకూల ఫలితాలు కలుగచేస్తారు. ఈ గురువే ధనుర్ రాశి వారికి తరచుగా స్వల్ప అనారోగ్యతను కూడా కలుగచేస్తారు.

ధనుర్ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని వలన కూడా గత సంవత్సరం మాదిరే చక్కటి అనుకూల ఫలితాలే ఏర్పడతాయి. ధైర్య స్థైర్యముల తో ఎటువంటి క్లిష్ట పరిస్టితిని అయినా ఎదుర్కొని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పరాక్రమం తో కూడిన విజయం సదా మీ సొంతం అవుతుంది. ధనుర్ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

ధనుర్ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహువు వలన ప్రతికూల ఫలితాలు ఎదురగును. విద్యార్ధులకు కొద్దిపాటి ఆటంకాలు కలుగచేస్తారు. భూమి లేదా గృహ క్రయవిక్రయాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటారు. వాహనాల డీలర్ షిప్ వ్యాపారం చేయు వారికీ ఈ సంవత్సరం అనుకున్న విధంగా లాభాలు లభించవు.

ధనుర్ రాశి వార్కి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతువు వలన సంవత్సరం అంతా ధనార్జన విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్ధిక సంబంధ విషయాల్లో ప్రతికూలత తీవ్రంగా ఎదుర్కోను వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.

ఏప్రిల్ 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చక్కటి సుఖసంతోషాలు ఉండును. భూ లాభం లేదా గృహ లాభం ఏర్పడును. వ్యాపార వ్రుత్తి జీవనంలోని వారికి ఆశించిన ధన లాభములు ప్రాప్తించును. నూతన భాద్యతల వలన విశ్రాంతి వుండదు. ప్రధమ ద్వితియ వారములలో నూతన స్నేహ పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం బాగుండును. 18 వ తేదీ తదుపరి ఉద్యోగ పరమైన లాభములు పొందుదురు. నూతన ఉద్యోగ ప్రయత్నములలో జయము సిద్ధిస్తుంది. ఈ మాసం మొత్తం ఉద్యోగ ఉన్నతి కొరకు ప్రయత్నాలు చేయవచ్చు. అందరి మన్ననలు పొందుదురు.

మే 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసం కుటుంబ సభులకు జ్వరతత్వం సంబంధ ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. కష్టంతో పనులు పూర్తి అగును. నిల్వ ధనము కొంత వ్యయం అగును. మాస మధ్యమం నుండి లాభకరమైన , సంతోషకరమైన పరిస్థితి లభించును. వ్యాపార వర్గం వారికి ప్రభుత్వ సంబంధ ఆటంకములు ఎదురగును. ప్రతీ వ్యవహారం స్వయంగా పర్యవేక్షించవలసిన పరిస్థితులు ఏర్పడును. శ్రమ అధికమగును. 22 వ తేదీ తదుపరి నూతన ప్రయత్నాలు ఫలించవు. ఈ మాసంలో 1,7,9,11,25 తేదీలు అనుకూలమైన రోజులు కాదు.

జూన్ 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చిన్న శస్త్ర చికిత్స జరుగుటకు అవకాశం ఉన్నది. గృహంలో చొరభయం ఏర్పడుతుంది. ద్వితియ వారం నుండి కార్యభారం పెరుగును. దూరప్రాంత ప్రయాణములకు సంబందించిన ఆలోచనలు కార్య రూపం దాల్చవు. మనోవేదన కలిగించు సంఘటనలు జరుగును. తీవ్ర ప్రయాస అనంతరం ప్రారంభించిన కార్యములు పూర్తి అగును. వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును.ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములు అన్వేషిస్తారు. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును. ఈ మాసంలో ప్రతీ సోమవారం ఈశ్వర అభిషేకాలు జరిపించుట మంచిది.

జూలై 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జీవిత భాగస్వామితో చక్కటి అనుకూలత సిద్ధిస్తుంది. సౌకర్యవంతమైన జీవనం లభిస్తుంది. మీ అవసరముల కోసం బంధు వర్గంపై ఆధారపడకుండా ఉండుట మంచిది. ఈ మాసంలో వృధా వ్యయం తగ్గును. ద్వితియ వారంలో విందు భోజన యోగం ఉన్నది. వాహనముల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశీ లేదా ఉద్యోగ ప్రయత్నములలో కష్టం మీద విజయం ప్రాప్తిస్తుంది. విదేశీ జీవన ప్రయత్నాలకు 7,8,9,10 తేదీలలో ప్రయత్నించుట మంచిది. ఈ మాసంలో 3, 12, 17, 23, 27 తేదీలు అనుకూలమైనవి కావు.

ఆగష్టు 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా అనుకూలమైన కాలం. సజ్జన సాంగత్యం లభించును. వినోద కార్యక్రమాలలో పాల్గోనేదురు. వస్త్ర, గృహ, ధన లాభములు పొందుతారు. ఋణ బాధలు తొలగును. కుటుంబంలో మానసికంగా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన బాటలు ఏర్పడును. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ఈ మాసంలో 19 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును.

సెప్టెంబర్ 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో చేరికలలో పాల్గొంటారు. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర స్నేహితలతో కలయిక మానసికంగా ఉల్లాసము కలుగచేస్తుంది. జీవిత భాగస్వామితో పరుష వాక్కులు మాట్లాడట వలన దీర్ఘకాలం పాటు సంబంధ భాందవ్యాలు దెబ్బతింటాయి. వృత్తి వ్యాపారములు అనుకూలంగానే కొనసాగును. మాసాంతంలో పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. నిల్వ ధనమును తిరిగి ఏర్పరచుకోనగలుగుతారు. ఈ మాసంలో 8, 16, 24 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు.

అక్టోబర్ 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రేమ వ్యవహారములందు అవరోధములు ఎదురగును. మానసిక వ్యధ బాధిస్తుంది. అకాల భోజనముల వలన శిరోబాధ, నిద్రలేమి ఇబ్బంది పెట్టును. ఉద్యోగ జీవనంలో కష్టం మీద లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. విరామం లేకుండా శ్రమించ వలసి వస్తుంది. చివరి వారములో రహస్య సమాచారములు తెలుసుకుంటారు. ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోనిన మంచిది. శ్రమతో కూడిన ప్రయాణములు ఎదురగును. ఈ మాసంలో 9,13,15,22 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

నవంబర్ 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చికాకులు ఉన్నప్పటికీ చివరకు విజయం సిద్దించును. జీవిత భాగస్వామి సంబంధ విషయాల్లో ప్రతికూలత కొనసాగును. శత్రు జయం ప్రాప్తించును. మీరు చేయు పనులలో గుర్తింపు లభిస్తుంది. పురాణ శ్రవణ పుణ్య ఫలం లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఉద్యోగ మార్పు ప్రయత్నములకు ఈ మాసం అనుకూలమైన కాలం. కుటుంబ సభ్యుల ప్రవర్తనా తీరు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండదు. చివరి వారంలో శ్రమ అధికం అగును.

డిసెంబర్ 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు, స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదురగును. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. రావలసిన ధనం సమయానికి అందుట కష్టం. మాసం మధ్య నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభం అవుతుంది. సంతాన ప్రయత్నములు దైవ ఆశీస్శులతో సాఫల్యం పొందును. ఆర్ధిక విషయాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ జీవనం వదిలి వ్యాపార రంగంలోనికి అడుగు పెట్టాలి అనే భావన మనస్సులో ప్రారంభం అవుతుంది.

జనవరి 2025 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మొదటి వారం అంత అనుకూల ఫలితాలు ఇవ్వదు. ఆ తదుపరి నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. వ్యాపారములో అభివృద్ధి ఆశించిన విధంగా ఉంటుంది. పిత్రు వర్గీయులతో విరోధములు చికాకు కలుగ చేస్తాయి. తృతీయ వారంలో ఊహించని రీతిలో ఒక ఆకస్మిక కష్టం ఎదురగును. అనుకోని ఖర్చులు పెట్టవలసి వస్తుంది. వివాహ ప్రయత్నములలో ఆశాభంగమునకు గురి అవుతారు. ఈ మాసంలో 5,7,25,29 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ రోజులలో ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో పాల్గొనుట మంచిది కాదు.

ఫెబ్రవరి 2025 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. తగాదాలలో మీ వాదనలకు విలువ లభిస్తుంది. బంధువుల కలయిక వలన సంబంధాలు మెరుగుపడును. ఎంతో కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి అగును. జీవిత భాగస్వామి తో సమస్యలు తగ్గును. 22 వ తేదీ తదుపరి సంతోషకర వార్తలు వింటారు. జీవనంలో కోరుకున్న విధంగా ఉన్నతి లభిస్తుంది. ఈ మాసంలో ఆదాయంలో పెరుగుదల పొందుతారు. సువర్ణ పెట్టుబడులు చేస్తారు.

మార్చ్ 2025 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఆత్మీయులకు సంబంధించిన ఒక విషయం ఆందోళన కలుగచేస్తుంది. ఆదాయం బాగుండును. ధన సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. కుటుంబ జీవన ప్రమాణాలు పెంచగలుగుతారు. జీవిత భాగస్వామి తోడ్పాటు సంపూర్ణంగా లభించుట వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పుత్ర పౌత్రాభివృద్ధి అనుభవిస్తారు.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.