Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2023 - 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 14, వ్యయం - 11, రాజ పూజ్యం - 06, అవమానం - 01 
  • పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "0". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎదురగు గౌరవ హాని , అపఖ్యాతిని సూచిస్తున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Vrushbha Rasi / Taurus Sign...

వృషభరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం 21 ఏప్రిల్ 2023 వరకూ అతి చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. న్యాయవంతంగా విశేష ధనాన్ని ఆర్జించెదరు. అదృష్టం కలసి వస్తుంది. 22 ఏప్రిల్ 2023 నుండి సంవత్సరం పుర్ర్తి అగు వరకూ గురు గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండు పరిస్టితులు ఎదురగును. వ్యయం అధికంగా ఏర్పడినా ఖర్చు జరిగిన ధనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు.

వృషభరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని గ్రహం మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ జీవనములోని వారికి ఈ సంవత్సరం అంతా శని మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఆశించిన విధంగా ప్రమోషన్లు , నూతన అధికార భాద్యతలు ఏర్పరచును. ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు ఆశించు వారు ఈ సంవత్సరం ప్రయత్నించుట కలసి వస్తుంది. కానీ శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని వ్యాపార పరంగా మాత్రం అనుకూల ఫలితాలు ఇవ్వరు. వ్యాపార పరంగా భారీ నష్టములు ఎదురగు సూచనలు ఉన్నవి. వ్యాపారస్థులు ఈ సంవత్సరం నూతన వ్యాపారములు ప్రారంభించకుండా ఉండుట మంచిది. వ్యక్తిగత జాతకంలో శని బలం సంపూర్ణంగా కలిగీ ఉన్న వారకి వ్యాపార పరంగా సమస్యలు ఉండవు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో వృషభరాశి వార్కి ఏలినాటి శని దశ లేదు. 

వృషభ రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 29-అక్టోబర్-2023 వరకూ చెడు ఫలితాలు ఎదురగును. వృషభ రాశి వారి చేతిపై వృధాగా విశేష ధనం వ్యయం అగును. దుర్జన సహవాసం వలన అపఖ్యాతి మూట కట్టుకొండురు. స్నేహముల విషయంలో ఈ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల వలన కూడా పరాభవం పొందుటకు సూచనలు అధికంగా ఉన్నవి. 30-అక్టోబర్-2023 నుండి కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ అన్వేషణ లో ఉన్న వారికి చక్కటి అవకాశములను ఏర్పరచును. దూర ప్రాంత ఉద్యోగ జీవన ప్రయత్నములు చేయువారికి అనుకూల ఫలితాలు ఏర్పరచును. నూతన వాహన సౌఖ్యం కలుగచేయును. మొత్తం మీద వృషభ రాశి వారికి రాహువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇవ్వరు. 

వృషభ రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు లాభ వ్యయాలు సమానంగా ఉండునట్టు చేయును. సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారికి విచారత , ప్రతికూల ఫలితాలు ఏర్పరచును. మాతృ వర్గం వారకి ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం మంచిది కాదు. ఆరోగ్యం సహకరించదు. సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.

ఏప్రిల్ 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కుటుంబ మరియు వ్రుత్తి పరమైన జీవనములలో చక్కటి వాతావరణం లభిస్తుంది. అన్ని విధములా లాభపూరిత ఫలితాలు ఉంటాయి. అన్ని వర్గముల వారు ఆశించిన స్థాయిలో అభివృద్దిని పొందుదురు. నూతన వ్యాపార ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. స్త్రీలకు గౌరవ ప్రదమైన జీవనం కొనసాగుతుంది. తృతీయ వారంలో దగ్గరి బంధువులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినవలసి వస్తుంది. ఈ మాసంలో ధనాదాయం పెరుగును. శత్రు నాశనం ఆనందాన్ని కలుగచేస్తుంది.

మే 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా లాభాపురితంగా ఉండును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు లాభించును. దూర ప్రాంత ప్రయానములు ఫలించును. సంతాన సంబంధ ప్రయత్నాలు మాత్రం కేతు గ్రహ మూలంగా విఫలమగును. మాసం మొత్తం మీద ధనాదాయం బాగుండును. ద్వితీయ తృతీయ వారంలో శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా కలసివచ్చును. చివరి వారంలో జ్వరతత్వ సమస్యలు బాధించును. ఆలోచనలు కూడా అదుపులో ఉండవు. నష్టపురిత ఆలోచనలు అధికంగా చేయుదురు. ప్రలోభాలకు లొంగ కుండా ఉండుట మంచిది.

జూన్ 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నూతన ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు అనుకూలమైన గ్రహ బలాలు కలవు. వ్యాపార వ్యవహారాలు లాభాపురితంగా ఉండును. వైవాహిక జీవనంలో కొద్దిపాటి అసంతృప్తి ఎదురగును. దంపతుల మధ్య వివాదాలు ఏర్పడును. దంపతులకు ఆరోగ్య పరంగా కూడా అంత మంచిది కాదు. 15వ తేదీ తదుపరి ప్రయాణ ప్రయత్నాలు, విదేశీ సంబంద ఆదాయానికి, ఉద్యోగంలో మార్పునకు, నూతన వాహన కొనుగోలుకు అనువైన సమయం. పనులలో విజయం ఏర్పడును. సకాలంలో పనులు పూర్తి అగును. ఈ మాసంలో 28,29,30 తేదీలలో వ్రుత్తి జీవనంలో ఒత్తిడి ఏర్పడుతుంది.

జూలై 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ వారంలో ధనాదాయం బాగుండును వైవాహిక జీవనంలో చికాకులు తొలగును. కుల వృత్తి జీవనం చేయువారికి అధిక ధనాదాయం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకర సంఘటనలు జరుగుతాయి. ద్వితీయ వారంలో చక్కటి అభివ్రుద్దికర అవకాశాలు లభిస్తాయి. యువ దంపతులకు చక్కటి సంతానం ప్రాప్తించు సూచనలు ఈ మాసంలో కలవు. విద్యార్ధులకు వారి వారి అభీష్టం మీర విద్యా పరమైన, విధ్యాలయాలందు ప్రవేశం కొరకు ఆశలు నెరవేరును. గృహ నిర్మాణ పనులలో ఆటంకములు మాత్రం కొనసాగును. తృతీయ వారంలో కూడా తీసుకొను నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చును. చివరి వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. మొత్తం మీద ఈ మాసంలో జీవనం సంతృప్తికరంగా ఉండును. శత్రు విజయం ఏర్పడును.

ఆగష్టు 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గృహ నిర్మాణ సంబంధ విషయాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగును. ధనాదాయం బాగుండును. మీ ప్రమేయం లేకుండానే కొన్ని పనులు పూర్తి అగుట మిమ్మల్ని ఆనందిమ్పచేస్తుంది. మీ వర్గంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విషయాలపై ఏకాగ్రత పెరుగును.నూతన సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుంది. వ్యక్తిగత జీవనం కూడా ప్రశాంతంగా ఉండును. ఈ మాసంలో 12,16,17,26, 27 తేదీలు అనుకూలమైనవి.

సెప్టెంబర్ 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనవ్యయం కొంచం అధికం అగును. జీవన మార్గంలో కొద్దిపాటి సమస్యలు లేదా దీర్ఘకాలిక నష్టాలు ప్రారంభం అగును. సక్రమ పద్ధతిలో జీవనం చేయని యువతీ యువకులకు ఈ మాసం మంచిది కాదు. ఆరోగ్య పతనం ప్రాప్తించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. అనాలోచిత నిర్ణయాల వలన నష్టములు పొందుతారు. ముందస్తు ప్రణాళిక అవసరం. పెద్దల జోక్యంతో వివాదాలు పరిష్కారం అగును. చివరి వారంలో చేయు ప్రయాణాలు విజయవంతం అగును. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు.

అక్టోబర్ 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆర్ధిక సమస్యలు పరిష్కరించబడతాయి. పట్టుదలతో కార్య సిద్ధిని పొందుతారు. నూతన పనులలో సానుకూలత లభిస్తుంది. కానీ నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మాత్రం ఈ సంవత్సరం అనుకూలమైనది కాదు. రోహిణి నక్షత్ర జాతకుల సంతానం మంచి స్థితిలో స్థిరపడును. స్త్రీల ఆశలు నెరవేరును. చేపట్టిన పనులలో ఇబ్బందులు ఉన్నా చివరికి విజయం పొందేదురు. తృతీయ వారం నుండి ఉద్యోగ జీవనంలోని వారికి ప్రమోషన్ పరమైన లాభాలు లేదా నూతన ఉద్యోగ అవకాశములు ప్రాప్తిస్తాయి. ఈ మాసంలో 11,15,26,30 తేదీలు అనుకూలమైనవి కావు.

నవంబర్ 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. నడుస్తూ ఉన్న వ్యవహారాలు ఆకస్మికంగా ఆగిపోవును. మాట లేదా నిందలకు మానసికంగా సిద్ధం కావలెను. వ్యాపారస్థులకు ఈ మాసం కొద్దిపాటి కష్ట కాలం. బంధు వర్గం లేదా స్నేహ వర్గం వలన ఆశించిన సహకారం సమయానికి అందదు. ఉద్యోగులకు పై అధికారుల వలన చికాకులు ఎదురవుతాయి. ప్రాజెక్టులు ఆశించిన విధంగా ముందుకు సాగవు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేయువారు జాగ్రత్త వహించవలెను. కేశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు బాధించును.

డిసెంబర్ 2023 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా వ్యవహరపు చిక్కులు, సమస్యలు కొనసాగును. కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం అంతగా బాగోదు. ఉన్మాదంతో ప్రవర్తిన్చెదరు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. బంధు కలహాలు, కోర్టు వివాదాలు. విద్యార్ధులకు వ్యతిరేక ఫలితాలు. నూతన కార్యములు విఫలమగు సూచనలు అధికం. సమయ స్పూర్తి లోపించును. స్నేహితులతో మాట్లడునప్పుడు జాగ్రత్త అవసరం. వ్యయంపై నియంత్రణ కోల్పోవు సంఘటనలు ఎదురగును. ఈ మాసం తృతీయ వారం వ్యాపార రంగంలోని వారికి అంత మంచిది కాదు. ఆర్ధిక పరమైన విషయాలలో భారీ నష్టానికి సూచన ఉన్నది.

జనవరి 2024 వృషభరాశిరాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యక్తిగత జీవన సంతోషాలు కొంచెం తక్కువగా ఉండును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. పై అధికారులతో వివాదాలు తగ్గును. ధనవ్యయం కొద్దిగా అదుపులోకి వచ్చును. నూతన ఆలోచనలు కార్యరూపంలోకి పెట్టుటకు, పెద్దలను సంప్రదించుటకు ఈ మాసం లో 16 వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ అనుకూలమైనది. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో ఒక నష్టం లేదా ఆందోళన, ఆవేశపడే సంఘటనలు, వాహన సంబంధ నష్టములు ఎదురగును. ఈ మాసంలో ఉత్తరాయణ కాల ప్రారంభం తదుపరి ఈశ్వర అభిషేకములు, సకల భూత గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.

ఫెబ్రవరి 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. పరిస్థితులు సజావుగా కొనసాగును. మానసిక అశాంతి తొలగును. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరికలు ఏర్పడతాయి. అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. వివాదాలలో జయం లభిస్తుంది. ద్వితీయ వారంలో అన్ని కార్యములలో కార్య సిద్ధి లభిస్తుంది. జీవనంలో స్థిరత్వం ప్రాప్తిస్తుంది. 21,22,23 తేదీలలో కాలం దుర్వినియోగం అవుతుంది. కుటుంబం తో కాలం గడపడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో మీ అభిప్రాయాలను పంచుకోండి. కుటుంబ సహకారం లభిస్తుంది.

మార్చ్ 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రత్యర్ధుల వలన చికాకులు. గౌరవానికి సంబందించిన సమస్యలు భాదిస్తాయి. నేత్ర సంబంధ అనారోగ్యం కలిగిన వారికి సమస్య తీవ్రం అవుతుంది. శస్త్ర చికిత్సకు దారి తీయును. ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు సామాన్యం. ధనాదాయం సామాన్యం. నూతన వ్యవహారాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చును. అశ్రద్ధ వలన నష్టములు లేదా శ్రమ. ఈ మాసంలో ఉద్యోగ మార్పిడికి ప్రయత్నములు చేయకుండా వుండడం మంచిది.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.