Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 03, అవమానం - 03

  • పూర్వ పద్దతిలో వృచ్చిక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి విజయాన్ని, నూతన ఆదాయ మార్గాలు లభించట ను సూచించుచున్నది. 

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Vrucchika Rasi / Scorpion Sign's Nature.....

వృచ్చికరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 21-ఏప్రిల్-2023 వరకూ పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పరచును. ధన సంపదలు ఆశించిన విధంగా ఏర్పరచుకోగలరు. కుటుంబ సంతోషాలు , కుటుంబ అభివృద్ధి పుష్కలంగా ఉండును. 22-ఏప్రిల్-2023 నుండి గురువు అంతగా యోగించడు. ముఖ్యంగా రావలసిన ధనం చేతికి వచ్చుటలో ఇబ్బందులు కలుగ చేయును. సంతాన ప్రయత్నాలకు విఘ్నాలు ఏర్పరచును. పాపపు కార్యములు చేతిపై జరుగు అవకాశములు కలవు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి శని వలన సంవత్సరం అంతా సామాన్య ఫలితాలే ఎదురగును. మాతృ వర్గం వారి వలన లాభపడుడురు. విద్యార్దులకు చక్కటి విద్యాభ్యాసం లభిస్తుంది. రైతులకు చక్కటి దిగుబడి లబిస్తుంది. యంత్ర సంబంధ సహాయం వలన లాభములు ఆర్జిస్తారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృచ్చికరాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి రాహువు వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలే ఎదురగును. ముఖ్యంగా వారసత్వ సంబంధ వ్యవహారాలలో మిక్కిలి లాభములు కలుగచేయును. ఆస్థి సంబంధిత సమస్యలు సునాయాసంగా పరిష్కారం అవుతాయి. 30-అక్టోబర్-2023 తదుపరి వ్యక్తిగత జాతకంలో సర్ప దోషం కలిగిన వారికి సంతాన సంబంధ చికాకులు ఏర్పరచును.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి కేతువు వలన సంవత్సరం అంతా యోగించదు. వృధా ధన వ్యయం తరచుగా ఎదురగును. కష్టం మీదా పనులు పూర్తి చేయగలుగుతారు.

ఏప్రిల్ 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో రక్తసంభందీకుల వలన మేలు కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చును. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడును. గృహంలో సంతోష కార్యములు. వివాహ ప్రయత్నములు కలసివచ్చును. దూరప్రాంత ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. సోదర వర్గం వారికి అంత మంచిది కాదు. వృద్దులకు శ్వాస సంబంధ , నేత్ర సంబంద సమస్యలు. తృతీయ వారంలో ఇతరులను , పై అధికారులను మీ ప్రతిభతో ఆకట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పొందేదురు. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రశాంతంగా గడుపుతారు.

మే 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అన్ని విధములా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో క్రిమికీటకాదుల వలన ప్రమాద సూచన. విద్యార్ధులకు ఆశించిన విద్య. తృతీయ వారంలో నూతన పరిచయాలు. ఉత్తముల మైత్రి. సంతాన ప్రయత్నాలు అనుకూలించును. శత్రు ఓటమి. అవరోధాలు వాటంతట అవే తొలగిపోయే గ్రహ బలాలు కలవు. కుటుంబంలో ప్రేమ - అభిమానాలు ఉండును. నూతన వస్తువులకోరకు ధన వ్యయం.

జూన్ 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆదాయం బాగుండును. కానీ వైవాహిక జీవనంలో కొద్దిపాటి అశాంతి. ప్రధమ వారంలో బంధు వర్గంతో కలయికలు. సంతానం వలన ఆనందం. లాభం. ద్వితీయ వారంలో మానసిక చికాకులు , విచారం, ధనాదాయం అధికం. చట్టపరమైన సమస్యలు. తృతీయ వారంలో పనులలో ఆటంకములు. ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు. దేవాలయ దర్శన మంచిది. ఈ మసంలో 17,18,19 తేదీలు అంత అనుకూలమైన రోజులు కావు.

జూలై 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. ఆర్ధిక పరంగా, సామాజిక స్నేహాల వలన, స్వ ఆరోగ్య విషయాలలో సమస్యలు. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ఆదాయం కూడా సామాన్యం. వివాహ ప్రయత్నాలు విఫలం. శ్రమ అధికం. నిరాశాపూరిత వాతావరణం. చివరి వారంలో శుభాయోగం. శత్రు పీడ , మిత్ర బలము రెండింటిని ఎదుర్కొందురు. ప్రయత్నపూర్వక కార్య సిద్ధి ఏర్పడుతుంది.

ఆగష్టు 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా ప్రతికూల ఫలితాలను కలుగచేయును. గృహంలో అశాంతి. ప్రయాణాలలో నష్టం. ఉద్యోగ జీవనంలోని వారికి అకారణంగా మాటపడుట లేదా నిందపడు సంఘటనలు. స్త్రీలకు ఉదర , గర్భ సంబందిత సమస్యలు. ద్వితీయ వారం వరకూ ప్రయత్నాలు విఫలం. జాగ్రత్తగా వ్యవహరించాలి. తృతీయ వారంలో అధిక ఒత్తిడి. ఇబ్బందులు ఎదుర్కొందురు. చెడు సంఘటనలకు అవకాశములు వున్నవి. చివరి వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. నిత్యం లలితా పారాయణ చేయుట మంచిది.

సెప్టెంబర్ 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చాలా సమస్యలు తొలగును. దూర ప్రాంత ప్రయాణాలు లాభించును. వ్యక్తిగత జీవనంలో సంతోషములు ఏర్పడును. ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. ఆదాయం బాగుండును. విజయం లభించును. సహనానికి , ఓర్పుకు పరీక్ష ఏర్పడును. కొద్దిపాటి వ్యతిరేక శకునాలు కనిపించినా రావలసిన లాభం వస్తుంది. తృతీయ చతుర్ధ వారాలు సంతాన ప్రయత్నాలకు అనుకూలం.

అక్టోబర్ 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం నూతన పనులు ప్రారంభించుటకు మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగ వ్యవహారములందు మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. ఉద్యోగంలో ఆకస్మిక సమస్యలు. ఉన్నతాధికారుల వలన అవమానం లేదా సమస్యలు. నిరుద్యోగులకు ఆశాభంగం. మాస ద్వితియార్ధం నుండి విజయావకాసములు పెరుగును. కార్య సిద్ధి ఏర్పడుటకు దైవ బలం ప్రదానం. బుద్ధి బలం ఒక్కటే సరిపోదు. చివరి వారంలో నూతన మార్గాలు. మిత్రులతో కాలక్షేపం లేదా విందు వినోదాలు.

నవంబర్ 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆదాయం కొంత తగ్గును. ఆకస్మిక వ్యవహర నష్టము, ఆర్ధిక అంశాలలో చిక్కులు, రావలసిన ధనం స్థంభించుకోనిపోవుట వంటి సమస్యలు. ధనం ఖర్చు పెట్టు విషయంలో భవిష్యత్ కుటుంబ అవసరాలు గుర్తుపెట్టుకోవలెను. చివరి వారం ఆధ్యాత్మికంగా ఉత్తమమైన కాలం. గృహ నిర్మాణం లేదా గృహ మార్పిడి చేయువారికి అధిక వ్యయం వలన చికాకులు. పుత్రికా సంతతి ప్రాప్తి.

డిసెంబర్ 2023 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపార వ్యవహారములలో ఏర్పడిన స్తబ్ధత తొలగును. ఆదాయం గత మాసం కన్నా ఎక్కువగా ఉండును. మాతృ వర్గం వారి తోడ్పాటు లభించును. తలపెట్టిన వ్యవహారాలు విజయవంతమగును. ద్వితీయ తృతీయ వారాలలో వ్యతిరేక పరిస్థితులు క్రమంగా తొలగును. మిత్రవర్గం లేదా బంధు వర్గం ముందు మనసు విప్పి మాట్లాడుట వలన నష్టములు. మాసాంతానికి పనులు పుర్తిఅగును. వంశ పెద్దల ఆశీస్సులు లబించును. ఈ మాసంలో 7,8,14,15 తేదీలు ఉద్యోగ ప్రయత్నాలకు అనువైనవి. పదవీ లాభం ఏర్పడును. వివాహ ప్రయత్నములకు , నూతన స్థలం కొనుగోళ్లకు కూడా ఈ మాసం అనువైనది.

జనవరి 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కుటుంబంలో మీ మాట మీద నమ్మకం పెరుగు సంఘటనలు, కుటుంబ వ్యవహారములందు విజయం ప్రాప్తించును. ధనాదాయం బాగుండును. విద్యార్ధులకు కొద్దిపాటి నిరాశ. పెద్ద వయస్షు వారికి వెన్నుపూస సంబంధ సమస్యలు. శస్త్ర చికిత్సకు కూడా దారి తీయవచ్చు. కుటుంబ పరమైన వ్యయం అధికంగా ఉండుటకు సూచనలు కలవు. ప్రయాణాలు శ్రమతో కూడి ఉండును. తృతీయ వారం నుండి గాయత్రీ దేవి ఆరాధన ఆరోగ్య ఆర్ధిక విషయాలలో ఉన్నతిని ఏర్పరచును. నూతన వ్యాపార ఆరంభ విషయాలలో ఆటంకములు వున్నవి. పట్టుదల అవసరం.

ఫెబ్రవరి 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో సౌఖ్యం. ఆశించిన ధనాదాయం. ఉద్యోగులకు ప్రతివిమర్శల వలన నష్టం. భూ సంబంధ లేదా గృహసంబంధ యోగం. విద్యార్ధులకు కృషి అవసరం. ఈ మాసంలో 18 వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ అనువైన కాలం.

మార్చ్ 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిత్రుల వలన నూతన ఆదాయ మార్గాలు ఏర్పడును. నిల్వ ధనం కలిగి వుందురు. భాత్రు వర్గం వారికి మంచిది కాదు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి అగును. కుటుంబ జీవితంలో సామాన్య ఫలితాలు. బాధ్యతలు పెరుగును. వ్యాపారస్థులకు ఈ మాసం చక్కటి లాభాలను ఏర్పరచును. మానసిక ఉత్సాహం అవసరం అగును. 28వ తేదీ తదుపరి దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.