Placeholder image

2023 - 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 11, రాజ పూజ్యం - 07, అవమానం - 07

  • పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "0". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో తులా రాశి వారికి వివిధ ప్రమాదాల నుండి తప్పించుకొనుట, గౌరవ హాని సంఘటనలు ఏర్పడుటను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Tula Rasi / Libra Sign's nature....

తులారాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండ 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడును. నూతనంగా శత్రువులు తయారవుతారు. ఆర్ధికంగా ఋణాలు చేయవలసి వస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యం మరియు జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలవాట్ల పట్ల మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి వారకి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని వలన మాత్రమే బాగా కలసి వస్తుంది. ఆర్ధికంగా శని వలన మాత్రమే కొంచం వెసులుబాటు ఉంటుంది. వక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న వారికి గురువు యొక్క ప్రతికూల ప్రభావం అంతగా ఉండదు. సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారికి శ్రీ శనైచ్చరుడు సుందరమైన స్త్రీ సంతానమును ప్రాప్తింప చేయు అవకాశములు అధికంగా ఉన్నవి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

తులారాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. భూ సంబంధ లేదా గృహ సంబంధ లాభములు కలుగచేయును. శత్రు సంబంధ విషయాలలో విజయాన్ని ప్రాప్తింప చేయును. కానీ సంవత్సర మధ్య మధ్య శరీర ఆరోగ్య సమస్యలు, కళత్ర సంబంధ పీడ ఏర్పరచును.

తులారాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన దైవ సంబంధ విషయాల పట్ల ఆసక్తి అధికం అవుతుంది. పారమార్ధక చింత అధికం అగుట వలన తరచుగా పుణ్య క్షేత్ర సందర్శనలు చేస్తారు. 29-అక్టోబర్-2023 వరకూ కేతువు తులారాశి కి చెందిన బాలలకు మాత్రం తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పరచును.

ఏప్రిల్ 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపార వ్యవహారములు, ఆర్ధిక క్రయ విక్రయాలు అనుకూలంగా ఉండును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నములు చేయువారికి ఆఖస్మిక ఆటంకములు. ప్రధమ మరియు ద్వితీయ వారములలో ధనాదాయం బాగుండును. విధ్యార్ధులకు ప్రయత్నములు ఫలించి ఆశించిన విద్యాప్రవేశం. తృతీయ వారంలో ఆటంకములతో కార్య సిద్ధి. అనారోగ్య సమస్యలు వేధించు సూచన. బాగా ఎదిగిన సంతానం ప్రవర్తన వలన ఆందోళన. 20 నుండి 24 తేదీల మధ్య ఋణములు కోసం చేయు ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారములు చేయువారికి ఈమాసం కలసి వచ్చును.

మే 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో దీర్ఘకాలిక ఆలోచనలు కార్య రూపం దాల్చును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు కలసివచ్చును. ఆశించిన ఉద్యోగం పొందును. దూర ప్రాంత ప్రయాణముల వలన ధన వ్యయం ఏర్పడుటకు అవకాశం కలదు. ద్వితీయ వారంలో పెద్ద వయస్సు వారికీ చాతి సంబంధమైన అనారోగ్య సమస్య. ఉద్యోగ జీవులకు పనిచేయు స్థానంలో శత్రుత్వాలు, వివాదాలు. తృతీయ వారంలో ధనాదాయం సామాన్యం. మిత్రుల విషయంలో నిర్లక్ష్యం వలన నష్టం. సమయ పాలనలో విఫలమగును. చివరి వారంలో స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు కొరకు చేయు ప్రయత్నములు లాభించును. శ్రమ అధికం. వ్యక్తిగత విషయాలకు సమయం కేటాయించలేరు.

జూన్ 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసం అంతగా అనుకూలమైన ఫలితాలను కలిగించదు. ఏ వ్యవహారం తలపెట్టినా పూర్తి కావడం కష్టం. పుత్ర సంతానం కొరకు చేయు ప్రయత్నములకు , ఆర్ధిక లావాదేవీలకు ప్రతికూలమైన కాలం. భూ సంబంధమైన లేదా గృహ సంభంధమైన నష్టం ఏర్పడుటకు సూచనలు కలవు. వ్యాపార రంగంలోని వారికి స్తబ్దత. ధనం సమయానికి అందదు. పితృ వర్గం వారికి మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు, మానశిక వ్యాకులత బాధించును. జీవిత భాగస్వామితో , సంతానంతో కోపతాపాలు తగ్గించుకోనిన మంచిది. సోమవారములు బియ్యం జలదానం చేయుట మంచిది.

జూలై 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ వారంలో ఆఖస్మిక విరోధములు. శత్రుత్వం వలన బాధ. పట్టుదలకు పోవుట వలన వ్యవహార నష్టములు. కొన్ని ఆందోళనాపురిత సంఘటనలు. ధనాదాయం తగ్గును. ద్వితీయ వారంలో కూడా వ్యాపారంలో అనిచ్చితి కొనసాగును. 17 వ తేదీ తదుపరి వివాహ ప్రయత్నములు లాభించును. కుటుంభ సభ్యులకు సంభందించిన శుభవార్తలు. చివరి వారంలో అనవసరమైన ప్రయానములు, సమయం వృధా. ఈ మాసంలో 7,11,13, 24 తేదీలు అనుకూలమైనవి కావు.

ఆగష్టు 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుదురు. జాతకంలో సర్ప దోషం కలిగివున్నవారు ఎక్కువ ప్రతికూలత ఎదుర్కొండురు. వ్యవహారములు చివరి నిమిషం వరకూ ఆందోళన కలిగించును. వ్యాపారములు సామాన్యం. ధనాదాయం మధ్యమం. నిర్లక్ష్య ప్రవర్తన వలన ఘర్షణలు. ఉద్యోగ జీవులకు వృధా వ్యయం. చివరి వారంలో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యత. కుటుంబంతో ఆనందకర సమయం. ప్రయానములు ఫలించును.

సెప్టెంబర్ 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నములు ఫలించును. గృహంలో నూతన వస్తువుల చేరిక. ప్రయత్నములలో ఏర్పడుతున్న ఆటంకములు తొలగును. శత్రు విజయం ఏర్పడును. ఆశించిన స్థాయిలో ఆదాయం. ద్వితీయ మరియు తృతీయ వారములలో సామాన్య సంతోషాలు. సంతాన సంబంధ అనుకూలత. 18 వ తేదీ తదుపరి శ్రమతో కూడిన అభివృద్ధి. 22, 23 తేదీలలో ఊహించని ధన సమస్యలు లేదా నష్టములు. మాసాంతంలో కుటుంబ విషయాలకు సమయం కేటాయించేదురు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభించును.

అక్టోబర్ 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అనారోగ్య సమస్యలు కొద్దిగా పెరుగును. ధనాదాయంలో వ్రుద్ధి కనపడును. ఉద్యోగ మార్పుకు ఇది మంచి కాలం. వైవాహిక జీవనంలో సమస్యలు కుడా తగ్గును. మిత్రవర్గం తోడ్పాటు వలన కార్య భారం తగ్గును. కానీ 10 నుండి 15 వ తేదీల మధ్య ప్రారంభం ఐయిన పనులు తాత్కాలికంగా స్తంభించును. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చుట కష్టం. విద్యార్ధులకు శ్రద్ధ అవసరం. తృతీయ వారంలో వాహన మూలక ఖర్చులు ఉండును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. పోటీదారుల వలన సమస్యలు. వాయిదా పడుతూ వస్తున్న ప్రయానములు ఈ మాసంలో పూర్తి చేయుదురు.

నవంబర్ 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీ వ్యాపార ప్రయత్నములు చేయువారికి లాభం ఏర్పడును. బంధు వర్గంతో కలయికలు. గృహంలో ఆకస్మిక శుభకార్యములు. స్తిరాస్థి లాభం. ప్రయానములు లాభించును. 22 వ తదుపరి నమ్మిన వారి వలన ఆర్ధిక ఇబ్బందులు. స్నేహ విరోధాలు. వ్యవహర అపజయాలు. శిరస్సుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు. ఈ మాసంలో 5, 6, 14,20, 27 తేదీలు అనుకూలమైనవి కాదు.

డిసెంబర్ 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వారసత్వ సంబంధ సొమ్ము ఆశించువారికి శుభవార్త. ధనాదాయంలో పెరుగుదల. శత్రు ఓటమి. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఒక పట్టాన కొలిక్కి రావు. ద్వితీయ సంతాన ప్రయత్నాలు సఫలం అగును. క్రీడా సంబంధ వినోదం.గృహంలో సంతోషకరమైన వాతావరణం. మనోవాంచా ఫలసిద్ది. ఇష్ట కార్యసిద్ధి. మాసాంతంలో వ్యాపార రంగంలోని వారికి చక్కటి అబివృద్ధి. మొత్తం మీద ఈ మాసం కొద్దిపాటి అనుకూలమైన ఫలితాలనే కలుగచేయును.

జనవరి 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు నష్టపరుచును. ధర్మ కార్యములకు , దానములకు ధనం వినియోగించేదారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార వ్యవహారములు, స్థిరాస్థి సంబంధ క్రయవిక్రయాలు, వ్యవసాయ సంబంధ వ్యాపారములకు చక్కటి అభివృద్ధి. పాత మిత్రులతో కలయిక వలన కాలం ఉత్సాహంగా గడచును. తృతీయ , చతుర్ధ వారములలో ఖర్చులు, శ్రమ అధికం అగును.

ఫెబ్రవరి 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రతీ పని అనుకూలంగా జరుగును. నూతన వాహన కోరిక నెరవేరును. ధనాదాయం బాగుండును. చెవికి సంబంధించిన చిన్న సమస్య. నూతన వ్యక్తులతో పరిచయాలు. తన్మూలక లాభములు. విద్యార్ధులకు విజయములు. మైత్రీ వ్యవహారములకు ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో 13,20,26 తేదీలు అనుకూలమైన రోజులు కావు.

మార్చ్ 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా ప్రోత్సాహపురిత వాతావరణమును ఏర్పరచును. కుటుంబ , మిత్ర వర్గ సహకారం పూర్తిగా ఉండును. ధనలాభాలు ఏర్పడును. భూ లేదా పాత గృహ సంబంధ క్రయ విక్రయాలకు ఈ మాసం అనువైనది. కుటుంబంలో మాట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువుల ఆగమనం. సంతోషం. ఈ మాసంలో 17,18,19 తేదీలు వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నములకు , ప్రేమ వ్యవహారములకు అనువైనవి.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.