Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర మేషరాశి రాశీ ఫలాలు 

Sree Shobhakruth Nama Samvatsara Mesha Rasi / Aries Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2023 - 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 05 , రాజ పూజ్యం - 03, అవమానం - 01.
  • పూర్వ పద్దతిలో మేషరాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1" . ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు లాభ పూరితంగా కొనసాగుట, నూతన లాభ పూరిత అవకాశములు పొందుట సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Mesha Rasi / Aries Sign...

మేషరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం లో గురు గ్రహం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. గురు గ్రహం వలన మీ చేతిపై అనేక ధర్మ కార్యక్రమాలు జరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వచ్చును. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఈ సంవత్సరం కలసి వస్తుంది. పురుషులకు దేహ ధారుడ్యం పెరుగుతుంది. మీ రూప - లక్షణాలు మీకు ప్రత్యెక గుర్తింపు కలుగ చేస్తాయి. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం సంపుర్ణమంగా కలిగి ఉన్న వారికి ఈ సంవత్సరం అనేక విజయాలు వరిస్తాయి. కెరీర్ పరంగా సంపూర్ణ యోగం అనుభవిస్తారు.

మేషరాశి వారికి శ్రీ శోభకృత్  నామ సంవత్సరంలో శని సంవత్సరంలో అధిక భాగం చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఈ సంవత్సరం శని మేషరాసి వారికి విశేష ధనలాభాములను కలిగించును. పితృ సంభంద విషయాల్లో మాత్రం అంతగా అనుకూల ఫలితాలను కలుగచేయడు. పితృ వర్గీయులతో విభేదాలను ఏర్పరచును. ముఖ్యంగా 16-జూన్-2023 నుండి 02-అక్టోబర్-2023 మధ్య కాలంలో శని ఆకస్మిక ధన నష్టములను, చోర సంభంధమైన లేదా అగ్ని సంభంధమైన నష్టమును , వ్యవహరపు చిక్కులను, శారీరక పీడను, వాహన ప్రమాదములను కలిగించును. ఈ కాలంలో శనికి శాంతి జపములు జరుపుట మంచిది. 03-అక్టోబర్-2023 నుండి సొంత ఇంటి కొరకు ఆలోచిస్తున్నవారికి అతి చక్కటి గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

మేషరాశి వారికి శోభకృత్ నామ సంవత్సరంలో రాహు గ్రహం మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. 29-అక్టోబర్-2023 వరకూ శారీరక అనారోగ్యత , మానసికంగా అధిక ఒత్తిడి ఎదుర్కొన వలసిన పరిస్తితులు ఏర్పరచును. మీ కుటిల స్వభావం వలన తగాదాలలో ఇరుక్కొండురు. మిత్రుల నుండి దూరం అవుతారు. 30-అక్టోబర్-2023 నుండి రాహువు వలన ఏర్పడు సమస్యల తీవ్రత కొంత తగ్గును. వైద్య విద్య అభ్యసిస్తున వారికి ఈ కాలం చక్కటి అనుకూల కాలం.

మేషరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా 29-అక్టోబర్-2023 వరకూ తరచుగా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పరచును. వైవాహిక జీవనం తీవ్ర ఓడిడుకులు ఎదుర్కొనును. జీవిత భాగస్వామి ఆరోగ్యం సహకరించదు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు కూడా అంత త్వరగా విజయవంతం అవ్వవు. 30-అక్టోబర్-2023 నుండి కేతువు వలన అనుకూల ఫలితాలు లభించుట ప్రారంభం అగును. శత్రు సంబంధమైన , అనారోగ్య సంబంధమైన , ఆర్ధిక సంబంధమైన నష్టములు తగ్గు ముఖం పడతాయి. మొత్తం మీద కాల సర్ప దోషం కలిగిన మేష రాశి వారు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 29-అక్టోబర్-2023 వరకూ జాగ్రత్తగా ఉండుట మంచిది. శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి తరచుగా అభిషేకములు జరిపించుకోనుట కూడా మంచి చేయును.

ఏప్రిల్ 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాస ప్రారంభంలో అన్ని విధములా మంచి అనుకూలత లభించును. మొదటి వారంలో ఆశించిన ధనప్రాప్తి మరియు యువతకు వాహన సౌక్యం లభించును. ద్వితియ వారంలో గృహంలో బంధు లేదా స్నేహ వర్గ రాకపోకలు ఏర్పడును. ప్రధమ మరియు ద్వితీయ వారములు విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి శుభ ఫలితాలు ఏర్పరచును. కెరీర్ లో అభివృధి, నిరుద్యోగులకు మనోవాంచా ఫలసిద్ధి లభించును.19 వ తేదీ తదుపరి కుటుంబ పరమైన చికాకులు, కొనసాగుతాయి అనుకున్న పనులు వాయిదా పడుట, అనవసర ఘర్షణల వలన మరియు ధన అవసరములు పెరిగి మానసిక ఆందోళన ఏర్పడును. కుటుంబంలోని పెద్ద వయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు. ఈ మాసంలో 6, 11 , 15, 19, 23 తేదీలు మంచివి కావు.

మే 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో భరణీ నక్షత్ర జాతకులకు ధనసంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. కష్టంతో కార్యవిజయం సాధించగలుగుతారు. అశ్విని నక్షత్ర జాతకులకు విరోధుల వలన ఉద్యోగ జీవితంలో ప్రమాదం ఎదురగు సూచన. జీవితం పై వైరాగ్య భావన ఏర్పడగలదు. ద్వితియ వారంలో సామాన్య ఫలితాలు లభించును. భారీ విజయాలు లేదా తీవ్ర నష్టములు ఉండవు. తృతీయ వారంలో మానసిక ఒత్తిడి తగ్గును. జీవిత భాగస్వామి సంబంధ సుఖ సంతోషములు నెలకొనును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు / ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు చేసిడి ప్రయత్నాలు సఫలము అగును. నూతనంగా ప్రారంభించిన భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ మాసంలో 5 నుండి 10వ తేదీ మధ్య వివాహ ప్రయత్నములుకు అనుకూలమైన గ్రహ బలాలు ఉన్నవి.

జూన్ 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సోదర వర్గంతో వివాదములు ఏర్పడు సూచన. ఏకాభిప్రాయం లభించదు. గృహంలో కోరుకున్న విధంగా నిర్మాణ పరమైన మార్పులు చేయుదురు. నూతన వస్తువులను అమర్చుకొందురు. సోదర వర్గంతో వివాదాలు మినహా గృహ సంతోషాలు సంపూర్ణంగా లభిస్తాయి. తలపెట్టిన ప్రతీ వ్యవహారం నిదానంగా పూర్తిఅగును. 21వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు కొద్దిపాటి జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 7, 15, 18, 21, 25 తేదీలు ఆలోచనలు కార్యాచరణలో పెట్టుటకు అనుకూలమైనవి.

జూలై 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మీ కుటుంబ పెద్దలు చేసిన ఋణములు తీర్చివేస్తారు. మాతృ వర్గం వారి వలన ఆర్ధికంగా లాభం ఏర్పడుతుంది. ప్రయాణ మూలక అనారోగ్య సమస్యలు ఏర్పడు సూచన. ప్రధమ వారంలో ఆకస్మిక ఆర్ధిక లాభములు లభించును. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఎదురగును. తృతియ వారం విద్యార్దులకు మిక్కిలి అనుకూలంగా ఉండును. ముఖ్యంగా పరదేశ విద్య కోసం చెసే ప్రయత్నాలు లాభించను. బందువుల రాకపోకలు ఆనందాన్ని కలుగచేస్తాయి. మాసాంతంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. సన్మానం. నివాస మార్పు కోసం చేయు ఫలితాలు మాత్రం ఆటంకముల తదుపరి ఫలించును. స్థిరచిత్తంతో ప్రయత్నించవలెను. మొత్తం మీద ఈ మాసం సౌకర్యవంతంగా ఉండును.

ఆగష్టు 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గృహంలో ఆకస్మిక వినోద- సంతోష కార్యములు నిర్వహించెదరు. ప్రారంభ వారంలో చక్కటి మానసిక ప్రశాంతత లభించును. నూతన పరిచయాలు దీర్హకాలిక బంధాలకు దారితీయును. ఆదాయంలో పెరుగుదల ఉంది. ద్వితియ వారంలో కుల పరమైన వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు ఎదురగును. సమస్యలందు మిత్రుల సహాయ సహకారములు సంపూర్ణంగా లభించును. మూడవ వారం నుండి వ్యక్తిగత జీవనంలో వ్యయం అధికంగా ఉండు సూచన. వారసత్వ సంబంధ భూమి లేదా స్థిరాస్తి వ్యవహారములో వివాదములు ఏర్పడు సూచన. ఈ మాసంలో 13, 14, 20, 28 తేదీలు మంచివి కావు.

సెప్టెంబర్ 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారికి శుభ వార్త లభించును. చక్కటి రూపవంతులైన సంతానమ ప్రాప్తించును. ఉద్యోగ జీవనం లోని వారికి పై అధికారులతో చికాకులు ఏర్పడినప్పటికీ బుధ గ్రహ బలం వలన మనోవంచా ఫలసిద్దత లభించును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి లభించు సూచన. అందరి మన్ననలూ లభించును. ద్వితియ వారం తదుపరి నూతన గృహ ప్రయత్నములకు ఆర్ధిక సహకారం లభించును. మానసికంగా ఆలోచనలు అధికంగా చేయుదురు. ప్రేమకలాపముల వలన కొద్దిపాటి మానసిక ఆందోళన అనుభవించు సూచన. చివరి వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో కలహం, ఆహార సంబంధ అనారోగ్యత వలన చికాకులు.

అక్టోబర్ 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం ప్రాప్తించును. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధనార్జన చేయుదురు. సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన గుర్తింపు లేదా ఫలితం వుండదు. మీ పోటీదారుల వలన ఇబ్బందులు ఎదురగును. ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు ఏర్పరచును. మాసాంతంలో తలపెట్టిన ఒక ముఖ్య వ్యవహారం అటంకములను ఎదుర్కొనును. ఈ మాసంలో 25, 26,27 తేదీలలో పెద్ద వయ్యస్కులకు జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యను ఏర్పరచు సూచన.

నవంబర్ 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహరాలలో ప్రతికూల తీర్పులు లభిస్తాయి, అవివాహితుల వివాహ ప్రయత్నములు అటంకములను ఎదుర్కొంటాయి. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక ఆనందమును కలిగించును. ఉద్యోగ జీవనంలో స్థానచలన ప్రయత్నములకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో శాంతి - సౌఖ్యములు లభించును. వ్యాపారములు విస్తరించే అవకాశం ఉన్నది. మాసాంతంలో నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు లాభించును. ఉద్యోగ అన్వేషణకు ఈ మాసంలో 26, 28 మరియు 30 తేదీలు మంచి ఫలితాలను కలిగించును.

డిసెంబర్ 2023 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం బాగానే ఉంటుంది. సంఘంలో చక్కటి పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. శతృవులపై జయం పొందుతారు. వ్యాపార వర్గము వారికి అన్ని విషయములందు లాభములు లభించును. కుటుంబ పరమైన శుభ వార్తలు వింటారు. ద్వితియ వారంలో తలపెట్టిన ప్రయనములందు ఆకస్మిక నష్టం ఎదురగు సూచన ఉన్నది కావునా జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 9వ తేదీ నుండి 12 వ తేదీ వరకూ అంత అనుకూల కాలం కాదు.

జనవరి 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వ్యక్త్రిగత వ్రుత్తి పరమైన జీవనంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. వైవాహిక జీవనంలో చికాకులు, అన్యుల ప్రమేయం వలన గొడవలు ఏర్పడు సూచన. మానసిక శాంతి లోపించును. ఇతరులకు సహాయం చేయుట కూడా ఆత్మ తృప్తి ని కలుగ చేయదు. వాహన సంభందిత వ్యయం ఏర్పడును. విద్యార్ధులకు మంచి కాలం కాదు. విద్యావిఘ్నములను ఏర్పరచు సూచన. ద్వితియ మరియు తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ఆశించిన విజయం. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఏర్పడును. మాసాంతంలో ఆర్ధిక పరంగా వృద్ధి లభిస్తుంది.

ఫెబ్రవరి 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మీ ప్రమేయం లేకుండా అవమానములు, అపవాదులు ఏర్పడు సూచన. కాని చివరకు విజయం మీదే. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా పదవులు, హోదా పొందుటకు ఇది అనువైన కాలం కాదు. దూర ప్రాంతంలో స్థిరత్వం కొరకు చేయు ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. మాసాంతంలో ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండును. ఈ మాసంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు. ముఖ్యంగా ఈ మాసంలో 8 , 10 , 14, 17 తేదీలు మంచివి కావు. ి

మార్చ్ 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జీవిత భాగస్వామి మూలాన ధనప్రాప్తి లభిస్తుంది. ఊహించని విధంగా ఆకస్మిక ధన లాభములు పొందుతారు. వృత్తి వ్యాపారముల వారికి చక్కటి ధన సంపాదన లభిస్తుంది. గృహ వాతావరణంలో కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ ప్రసాంతత లోపించదు. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. మాసాంతంలో మిగులు ధనదయం. కార్య సఫలత. ప్రభుత్వ వ్యవహారములలో , కాంట్రాక్టు పనులందు చక్కటి అనుకూలత. ఈ మాసంలో 3, 6, 16, 23 , 25, 26 తేదీలు నూతన కార్య ప్రారంభములకు అనుకూలమైనవి.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.