Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Meena Rasi / Pisces Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 11, రాజ పూజ్యం - 01, అవమానం - 02

  • పూర్వ పద్దతి లో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఒక స్థాయకి మించని సౌకర్యవంతమైన జీవనం ఏర్పడుటను సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Meena Rasi / Pisces Sign's Nature....

మీనరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన గత సంవత్సరం మాదిరిగానే అత్యంత యోగ్యమైన జీవన మార్గం లభిస్తుంది. దేహ ధారుడ్యత పెరుగుతుంది. యుక్త వయస్సులోని వారికి విద్యా వినయ సంపన్నులుగా విశేష ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపార జీవనములోని వారికి గురువు విశేషమైన లాభములను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఉత్తరాబాద్ర నక్షత్ర జాతకులు సదా నిల్వ ధనం కలిగి ఉంటారు. మొత్తం మీద శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మీనరాశి వారికి గురువు అన్ని విధాల శుభ ఫలితాలు ప్రసాదిస్తారు.

మీనరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవతరంలో శని వలన అంతగా శుభ ఫలితాలు ఏర్పడవు. 18-జనవరి-2023 నుంచి మీనరాశి వారికి ఏడున్నార సంవత్సరముల ఏలినాటి శని దశ ప్రారంభం అగుట వలన ఈ సంవత్సరం కూడా శని వలన పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం లోపించిన వారు ఈ సంవత్సరం చేయు ప్రయనములందు జాగ్రత్తగా ఉండవలెను. ధన వ్యయం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. . నిత్యం శని గ్రహ కవచం స్మరించుట వలన సమస్యలు కొంత వరకు తగ్గుతాయి. 

మీనరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా మధ్య మధ్య శరీర పీడ, అధిక వ్యయం మధ్య మధ్య పూర్తి ఆరోగ్యం, అధిక ధనార్జన వంటి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఈ సంవత్సరం నూతన పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలందు మధ్యవర్తిగా ఉండుట మంచిది కాదు.

మీనరాశి వార్కి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. వైవాహిక జీవనంలో తరచుగా సమస్యలు వెంటాడతాయి. మొత్తం మీద మీనరాశి వారికి గురువు మాత్రమే మంచి ఫలితాలు ప్రసాదిస్తారు. ఏలినాటి శని , రాహువు మరియు కేతువు చెడు ఫలితాలు ప్రసాదించుట వలన ఈ సంవత్సరం కూడా సుఖ దుఖాలను మిశ్రమంగా పొందుతారు. 

ఏప్రిల్ 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసం మొదటి 15 రోజులలో అనుకూల ఫలితాలు, ఆశించిన లాభాలు ఏర్పడును. నూతన ఆదాయ మార్గాలు లభించును. సొంత వాహన ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారం చివరకు జీవిత భాగస్వామితో చిన్న తగాదా. మాస ద్వితియార్ధంలో స్థాన చలన సంబంధ ప్రయత్నాలు కలసివచ్చును. గొంతు సంబంధ సమస్యలు ఏర్పడుటకు సూచనలు కలవు. కుటుంబ సభ్యులతో వ్యవహరించునపుడు పట్టు విడుపులు అవసరం.ఖర్చు విషయాలలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం మంచిది. చివరి వారంలో శుభవార్తలు, ప్రయానములు ఫలప్రదం.

మే 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో పనులు ఆటంకములు ఎదుర్కొని పూర్తి అగును. అకారణంగా అనుమానిన్చాబదుట వంటి సంఘటనలు ఎదురగు సూచన. ధనాదాయం సామాన్యం. తృతీయ వారంలో కుటుంబ సభ్యుల మధ్య వాద ప్రతివాదనలు. వ్యాపార వ్యవహారములు సామాన్యం. ఉద్యోగ జీవనం కుడా సామాన్యం. స్పెక్యులెశన్ లాభించదు. 24 వ తేదీ తదుపరి ఈ రాశికి చెందిన చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు.

జూన్ 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. సోదర వర్గం వారితో సమస్య. నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. బంధు వర్గంతో ఉన్న సమస్యలు తొలగిపోవును. సహకారం లభించును. ఆరోగ్య విషయాలు కూడా సహకరించును. తృతీయ వారంలో దాన ధర్మాలు, ఆద్యాత్మిక చింత. 28,29,30 తేదీలలో ఉద్యోగ జీవనం చేయువారికి అననుకూల పరిస్థితులు.

జూలై 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపారములు అంత సవ్యంగా ఉండవు. మాత్రు వర్గీయులకు మంచిది కాదు. వాహన సంబంధ సమస్యలు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలెను. చిన్న పిల్లలకు కూడా ఆరోగ్య ప్రతిబంధకాలు. తృతీయ చతుర్ధ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. 26 వ తేదీ తదుపరి వృధా ఖర్చులు. కోపస్వభావం. తన్ములక తగాదాలు.

ఆగష్టు 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో దీర్ఘకాలిక సమస్యలకు ఒక పరిష్కారం ఏర్పడును. స్థాన చలనానికి సూచనలు. బంధు మిత్రుల సహకారంతో మానశిక ఆనందం. ద్వితీయ వారం నుండి ధనాదాయం పెరుగును. జీవన ప్రమాణాలలో ఉన్నతి. కుటుంబంలో చక్కటి అవగాహనా. తృతీయ చతుర్ధ వారాలలో సామాన్య ఫలితాలు.

సెప్టెంబర్ 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నూతన కార్యములు ప్రారంభించే సూచనలు కలవు. సంతానం వలన వ్యయం అధికము అగును. ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు ఉండదు. కానీ కొత్త బాధ్యతలు ఏర్పడుట లేదా శ్రమ అధికం అగుట వంటి పరిస్థితులు. 16.17,18,19 తేదీలలో నిరుత్సాహ పరిచే సంఘటనలు. వ్యక్తిగత అవమానాలు. ఈ మాసంలో ఇతరుల సలహాలు పాటించకుండా ఉండుట మంచిది. మానసిక సంసిద్ధత అవసరం.

అక్టోబర్ 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్య. గృహ సంబంధ విషయాలలో ప్రతికూల వాతావరణం. ధవ్యయం పెరుగుటకు సూచనలు. మాస మధ్యమం నుండి బాగుండును. వ్యాపారులకు మాత్రం సామాన్య ఫలితాలు. ఆటంకములు. 20 నుండి 27 వ తేదీల మధ్య ప్రత్యేకమైన గుర్తింపు. వివాహ ప్రయత్నాలు ఫలించును. బంధు మిత్రుల వలన సంబంధాలు కుదురును.

నవంబర్ 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యవహారాలు సమస్యలతో కొనసాగినా చివరికి ఫలవంతమై కార్య సిద్ధి ఏర్పడును. స్నేహితులతో విరోధం. నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు. అభద్రతాభావంతో కూడిన ఆలోచనలు అధికమగును. ధర్మబద్ధమైన ఆదాయం. మానసిక ఉత్సాహం కోరవడును. చివరి వారంలో ప్రశంసలు. సమస్యలు శాంతించును. ఈ మాసంలో 8,11,15,20 తేదీలు అనుకూలమైనవి కావు.

డిసెంబర్ 2023 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో దూర ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ప్రధమ వారంలో శిరస్శుకు సంభందించిన సమస్యలు. ధనాదాయం సామాన్యం. స్థిరాస్థి తగాదాలు. అనవసర పట్టుదల వలన సమస్యలు. ద్వితీయ తృతీయ వారాలలో కార్య సిద్ధి. వ్యాపారములండు లాభం, ఉద్యోగంలో పదోన్నతి. 21వ తేదీ తదుపరి విలాసముల కొరకు ధవ వ్యయం. వృధా ఖర్చులు. ఫలితం లేని చర్చలు.

జనవరి 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యవహారములు, ప్రయత్నములు సానుకూలత పొందును. గత కాలంలో ఆపివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు ఇది మంచి సమయం. ధనాదాయం పెరుగును. కోరికలు నెరవేరును. అవసరానికి ఆశించిన ఆర్ధిక సర్దుబాటు జరుగును. కుటుంబంలో సంతోష సమయాలు. వాహన సౌఖ్యం. చివరి వారంలో విద్యార్ధులకు సమస్యలు. ఈ మాసంలో 4 నుండి 16 వ తేదీ మధ్య అన్నిరకముల ప్రయత్నాలు కలసివచ్చు సమయం.

ఫెబ్రవరి 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో బంధు వర్గం వలన ఒక నష్టం. కుటుంబంలో ప్రతికూలత. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. సకాలంలో పనులు పూర్తి అవ్వవు. విమర్శకుల వలన మానసిక అశాంతి. ఆర్ధికంగా ఇబ్బందులకు అవకాశం. నిర్ణయాల పట్ల స్థిరత్వం అవసరం. 1,2,9,13,14,25 వ తేదీలు అనుకూలమైనవి కావు. మొత్తం మీద ఆర్ధిక పరంగా ఈ దశ మిశ్రమ ఫలితాలు ఇచ్చును.

మార్చ్ 2024 మీనరాశి రాశిఫలాలు:

ఈ మాసంలో తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడును. పై అధికారుల వలన లాభాములుండును. పదోన్నతికై లేదా ఉద్యోగ మార్పుకు , గృహాలపై పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం కలసి వచ్చును. పెట్టుబడుల వలన కలసివచ్చును. సంతాన ప్రయత్నాలు ఫలించును. రావలసిన ధనం చేతికి వచ్చును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.