Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Makara Rasi / Capricorn Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం- 11, వ్యయం- 05, రాజ పూజ్యం- 02, అవమానం- 06

  • పూర్వ పద్దతి లో మకర రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి వారికి విజయవంతమైన జీవన విధానాన్ని సూచించుచున్నది. 

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Marara Rasi / Capricorn Sign's Nature....

మకరరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా భాత్రు వర్గం వారి వలన అభివృద్ధి పొందుతారు. విద్యార్ధులకు చక్కటి విద్యాభ్యాసం లభిస్తుంది. నూతన యంత్ర సహకారం ఏర్పాటు చేసుకొంటారు. సొంత గృహ సౌఖ్యం ఏర్పాటు చేసుకొంటారు. మొత్తం మీద శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో గురువు వలన అనుకూల ఫలితాలు ఏర్పడును.

మకరరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. సొంత ఆరోగ్య విషయల్లో అశ్రద్ధ చేయుట వలన ఇబ్బందులు ఎదురగును. కుటుంబ పరమైన చికాకులు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. జీవిత భాగస్వామి తో సఖ్యత లోపిస్తుంది. అవివాహితుల వివాహ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అవుతాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుడా మకర రాశి వారికి ఏలినాటి శని దశ జరుగుచున్నది. కావునా ఈ సంవత్సరం కూడా మీరు సాహసోపేతమైన , అదృష్టం పై ఆధారపడు నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు.

మకర రాశి వారికీ శ్రీ శోభకృత్ నామ సంవతసరంలో రాహువు వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. 29-అక్టోబర్-2023 వరకూ అధిక ధన వ్యయం, భూ సంబంధ క్రయ విక్రయాల్లో నష్టం, మాతృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలు , పరదేశ ఉద్యోగాలు చేయువారికి ఉద్యోగ అస్టిరత్వం వంటి సమస్యలు ఎదురగును. 30-అక్టోబర్-2023 నుండి రాహువు వలన మంచి ఫలితాలు ఏర్పడతాయి. సంపుర్ణమైన ఆయుర్భాగ్యములు లభిస్తాయి.

మకర రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన శుభ ఫలితాలు ఏర్పడతాయి. మనోవాంచా ఫల సిద్ధత లభిస్తుంది. పితృ వర్గం వలన ఒక పెద్ద లాభం ఏర్పడుతుంది.

ఏప్రిల్ 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మాసంలో నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. ఆశించిన శుభ ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నములు మాత్రం శని గ్రహం వలన విఫలం అగును. జీర్ణ సంబంధ ఆరోగ్య సమస్యలు. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో వాహన చోదన విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారములందు శ్రద్ధ చుపించవలెను. తృతీయ చతుర్ధ వారాలలో ఉద్యోగస్తులకు ప్రశంసలు లేదా ఉద్యోగంలో స్థిరత్వం.

మే 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసం స్వ ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు. ఆదాయం తగ్గును. మూత్ర సంబంధ సమస్యల వలన బాధ. పనుల్లో ఉత్సాహం తగ్గును. మానసిక ప్రశాంతత కోరవడును. ధైర్యంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడు సూచన. నూతన వ్యక్తులతో మాటలడునప్పుడు లేదా వ్యవహరించుటలో జాగ్రత్త అవసరం. 14వ తేదీ నుండి 20వ తేదీ మధ్య ఆరోగ్య పరంగా జాగ్రత్త పడాలి. 25 వ తేదీ తదుపరి తలపెట్టు ప్రయాణాలు లాభించును.

జూన్ 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మాసంలో 11 వ తేదీలోపు చేయు అన్నిరకముల ప్రయత్నాలు ఫలవంతం అగుటకు చక్కటి గ్రహ స్థితులు కలవు. ఆరోగ్య సమస్యలు ఉపసమించును. వ్యాపారములు సామాన్యంగా నడుచును. ఉద్యోగ మార్పుకు ఈ మాసం మంచిది కాదు. ఉద్యోగ జీవనంలో శ్రమ అధికం అగును. ఆర్ధికంగా నష్టం ఎదుర్కొనుటకు సూచన కలదు. కావున 11వ తేదీ తదుపరి నూతన వ్యవహారములు ప్రారంభించకుండా ఉండుట మంచిది. పూర్వకాలపు ఋణభారం చికాకు కలిగించును. సన్నిహితుల తోడ్పాటు అవసరమగును.

జూలై 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆకస్మిక సమస్యలు, అకారణంగా మాటపడుట, నిందలకు గురి అగుట వంటి సంఘటనలు కలుగచేయును. ఆదాయం సామాన్యం. చేపట్టిన పనులు సొంత కాలయాపన వలన ఆలస్యమగును. కార్య దక్షత, స్వీయ నిగ్రహం అవసరం. ఆశ్రద్ధతో కూడిన ధోరణి వలన నష్టాలు. ఈ మాసంలో అతి ధైర్యం పనికిరాదు. భాత్రు వర్గమునకు మీ సహకారం అవసరమగును. ఈ మాసంలో 13,20,29 తేదీలు కలసిరావు.

ఆగష్టు 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సమస్యలు తగ్గును. వ్యాపార వ్యవహారాలు బాగుండును. ఉద్యోగంలో స్థానచలనం కోరుకొనే వారికి కోరిక ఫలించును. నిరుద్యోగులకు శుభవార్త. ఈ మాసం వీసా సంబంధిత ప్రయత్నాలకు మంచి కాలం. తలపెట్టిన పనులు చక్కగా పూర్తి అగును. పోయిన వస్తువులు తిరిగి పొందగలరు. స్నేహబంధాలు బలపడును. చివరి వారంలో కొద్దిపాటి ధన సమస్యలు.

సెప్టెంబర్ 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసం కుడా ఆర్ధికంగా బాగుండును. కానీ వ్యక్తిగత జీవనంలో తగాదాలు, జీవిత భాగస్వామితో విముఖత, కుటుంబ పరమైన ఊహించని సంఘటనలు ఏర్పడు సూచన. మర్యాదగా ప్రవర్తించుట మంచిది. బాధ్యతలను విస్మరించడం వలన మాటపడును. వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలు. దూరదృష్టి అవసరం. ఈ మాసంలో 10,11,12 తేదీలు కలసిరావు.

అక్టోబర్ 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసం పిత్రువర్గీయులకు అంత మంచిది కాదు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగతంగా ఒక ముఖ్య నిర్ణయం తీసుకోనుదురు. మొహమాటం వలన నష్టపోవుదురు. తృతీయ వారంలో ముఖ్య స్నేహవర్గానికి సంబందించిన దుర్వార్త వినుటకు సూచన. 27 వ తేదీ నుండి 29 వ తేదీల మధ్య ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేయుట మంచిది.

నవంబర్ 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనవ్యయం కొంచం పెరుగును. అవసరములకు తగిన ధనం అందుట కష్టం. తన్మూలక చికాకులు. ఆలోచనల్లో విశాల దృక్పధం, తార్కికతత్వం అవసరం. లేనిపోని అనుమానముల వలన వ్యక్తులను దూరం చేసుకోను సూచనలు. తగవులలో అపజయం. విక్రయాలకు ఇది మంచి మాసం కాదు. ఆశించినంతగా లాభం రాదు. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు. అహాన్ని విడిచిపెట్టాలి. సహోద్యోగుల వలన అశాంతి. ధనాదాయం సామాన్యం.

డిసెంబర్ 2023 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సొంత గృహం లేదా స్థలం కొరకు ప్రయత్నించుటకు అనుకూలమైన గ్రహ స్టితులు కలవు. వ్యాపార వ్యవహారాలు గత మాసంకంటే లాభదాయకంగా కొనసాగును. విదేశీ జీవన ప్రయత్నములకు, వివాహ ప్రయత్నాలు చేయుటకు మంచిది. మాత్రు వర్గీయుల వలన లాభం. అదృష్టవంతమైన కాలం. ఆర్ధికంగా ఎదుగుదల. శత్రు విజయం. ప్రశంసలు. కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం.

జనవరి 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి. సంతాన సంబంద ఆనందం లేదా సౌఖ్యం. జీవనంలో ప్రశాంతత. సజ్జన సాంగత్యం. పుత్రికా సంతతి కలిగిన వారికి నూతన బాధ్యతలు. చివరి వారంలో అధిక శారీరక శ్రమ. పేర్కొనదగిన ఇతర ప్రధాన ఫలితాలు ఏమియూ ఈ మాసంలో లేవు.

ఫెబ్రవరి 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో 12వ తేదీ వరకూ వ్యాపారస్థులకు అనుకూలం. క్రీడా రంగాలోని వారికి కూడా బాగా కలసివచ్చును. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందుటకు తగిన బలాలు కలవు. కోర్టు వ్యవహారాలు అనుకూలం. తృతీయ వారం నుండి మిశ్రమ ఫలితాలు. ఒత్తిడి పెరుగును. విలువైన వస్తువులు పోగొట్టుకొండురు. వృధా వ్యయం. ఆశించిన ఫలితాలు లభించవు. రక్షణ రంగంలో సేవ చేయువారికి మంచిది కాదు. ఈ మాసంలో 21 నుండి 26 వరకూ అనుకూలమైన రోజులు కావు.

మార్చ్ 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా ఫలితాలు మిశ్రమంగా ఉండును. విద్యార్ధులకు కలసివచ్చును. ఉన్నత విద్యావంతులు అగును. ప్రేమవ్యవహరములలో లేదా వ్యక్తిగత జీవితంలో స్పష్టత లభించును. హామీలు నిలబెట్టుకోలేరు. ఆర్ధిక విషయాలలో అత్యాశ వలన చక్కటి అవకాశములు చేజారుటకు సూచన. ధనాదాయం సామాన్యం.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.