Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 05, అవమానం - 06

  • పూర్వ పద్దతి లో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఏర్పడు ప్రోత్సాహకరమైన జీవనాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Kumbha Rasi / Aquarius Sign's Nature...

కుంభరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. నూతన ధన ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారములు బాగా లభిస్తాయి. కళాకారులకు చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సోదరి వర్గం వారి వలన బాగా లాభపడతారు.

కుంభ రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. సర్వ కార్యములందు శరీర శ్రమ అధికం అవుతుంది. కార్యములు సమయానికి పూర్తీ కావు. నిద్రాలేమి బాధిస్తుంది. జీవిత భాగస్వామి కి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. ఉద్యోగ జీవనం లోని వారికి ప్రమోషన్లు ఆఖరి నిముషంలో ఆగిపోవు అవకాశం ఉన్నది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం లోపించిన వారు ప్రతీ శనివారం నాడు పగటి సమయంలో ఉపవాసం ఆచరించుట మంచిది. కుంభ రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఏలినాటి శని దశ జరుగుతున్నది. కావునా సదా అలోచించి జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి.

కుంభరాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 29-అక్టోబర్-2023 వరకూ చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. జీవన స్థాయి మరియు ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య రంగం లోని వారికి విశేషమైన అనుకూలత ఉంటుంది. 30-అక్టోబర్-2023 నుండి రాహువు అంతగా యోగించరు. ధనానికి మధ్య మధ్య న చికాకులు ఏర్పరచును. అనారోగ్యత వలన ధన వ్యయం కూడా గాడి తప్పును.

కుంభ రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతు గ్రహ వలన కూడా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. 29-అక్టోబర్-2023 వరకూ భాగ్య సంపదల పరంగా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. కానీ వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం తక్కువ అవుతుంది. 30-అక్టోబర్-2023 నుండి శత్రు పీడ మరియు ఆరోగ్య సమస్యలు తరచుగా చికాకు కలుగచేయును. అదృష్టం అంతగా కలసి రాదు.

ఏప్రిల్ 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అనారోగ్య సమస్యలు కొనసాగును. నూతన వ్యవహారాలు, ఆలోచనలు , చేపట్టిన కార్యములు విజయవంతం అగును. వివాహ ప్రయత్నాలు ఫలించును. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయుటకు మంచి కాలం. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది. గృహంలో మార్పులు చేస్తారు. వ్యాపార వర్గములకు ఆశించిన ఆదాయం. 7 నుండి 15 వ తేదీల మధ్య వివాదాలు, అనుకోని ఖర్చులు.

మే 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా అనుకూల ఫలితాలు ఏర్పడును. రావలసిన ధనం చేతికి వచ్చును. వివాదాలు తొలగును. ధనాదాయం బాగుండును. రాబడి పెరుగును. శుభాకర్యములలో పాల్గోనుడురు. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. చివరి వారంలో వృధా ప్రసంగాలు. అలవాట్లలో మార్పులు ఏర్పడును. ఈ మాసంలో 5,26,27 తేదీలలో ఆర్ధిక సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం.

జూన్ 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చేయు ప్రయాణాలు కలసివచ్చును. ఆనందకరంగా ముగియును. వ్యాపారాలు సామాన్యం. ధనం సమకూరును. పనులు సకాలంలో పూర్తి అగును. గౌరవ మర్యాదలు పెరుగును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. ద్వితీయ వారంలో వృధా శ్రమ. తిరిగి 24వ తేదీ తదుపరి ప్రోత్సాహవంతంగా ఉండును. ముఖ్య నిర్ణయాలు తీసుకొనుటకు అనువైన కాలం. ఈ మాసంలో 10, 13, 14 తేదీలు అనుకూలమైనవి కావు.

జూలై 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. ఉద్యోగులకు, వ్యాపారస్థులకు సానుకూలమైన ఫలితాలు. పరిచయాలు పెరుగును. వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసివచ్చును. ఎంతో కాలం నుండి కోరుకుంటున్న మార్పులు ఈ మాసంలో ఏర్పడును. చివరి వారంలో కుటుంబంలో చిన్న తగాదా లేదా ఒక అననుకూలత.

ఆగష్టు 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆదాయం సామాన్యం. కుటుంబంలో పోయిన సఖ్యత , అనుబంధాలు తిరిగి స్థిరపడును. నూతన పరిచయాలు లాభించును. ఉద్యోగులకు లాభపూరిత కాలం. వ్రుద్ధి. నూతన అవకాశములు. మాసాంతానికి నిర్దేసించుకున్న పరిధిని మించి ఖర్చులు. వ్యక్తిగత జీవనలో సంతోషములు. సంతాన ప్రయత్నాలు ఫలించును.

సెప్టెంబర్ 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదు. వ్యాపారములందు , విదేశే వ్యవహారములండు తీవ్రమైన నష్టం. పితృ వర్గం వారితో విబేధాలు. స్థిరాస్థి వ్యవహారాలలో పెట్టుబడులు నష్టపరుచును. ఉదరకోశ వ్యాదులు ఉన్న వారికి ప్రమాదం. 16 వ తేదీ తదుపరి ఆర్ధిక విషయాలలో పురోగతి. శుభకార్యములకు ఆహ్వానములు. దాన ధర్మములకు వ్యయం. నూతన వస్తువుల చేరిక.

అక్టోబర్ 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు. ధనాదాయం సామాన్యం. ఖర్చులకు తగినంతగా రాబడి వుండదు. ఉద్యోగులకు కెరీర్ పరంగా కొత్త అవకాశములు లభించును. గృహ సంబంధ విషయాలకై తిరగవలసి వచ్చు సూచన. ఈ మాసంలో 2,9,14,17,22, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

నవంబర్ 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆర్ధికంగా కొంచం బాగుండును. పట్టుదలతో కూడిన కార్యసిద్ధి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అగుట, నూతన పనులు ప్రారంభించుట జరుగును. స్త్రే సంబంధ వ్యవహారాల వలన అపఖ్యాతి. జీవిత భాగస్వామి తరపు బంధువులతో విరోధాలు. దీర్ఘకాలిక రుగ్మతల వలన ధన వ్యయం. నూతన ఒప్పందాలు లాభించవు. మాసాంతానికి వ్యక్తిగత పరిస్థితులలో కొద్దిపాటి అనుకూలత.

డిసెంబర్ 2023 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చికాకులు క్రమంగా తొలగి పరిస్థితులు మెరుగు అగును. ఇతరులను ఆకర్షించేడురు. వివాదాలు పరిష్కారం అగును. వ్యాపారాలు ఆశాజనకంగా ఉండును. పారిశ్రామిక వేత్తలకు చక్కటి వ్రుద్ధి. గృహంలో సంతోషాలు. పరిస్థితులు లాభసాటిగా ఉండును. కుటుంబ అవసరాల కొరకు శ్రమ. బహుమతులు గెలుచుకోనుటకు అవకాశం. ఉద్యోగ జీవనంలో అదనపు బాధ్యతలు.

జనవరి 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. గౌరవ ప్రధమైన జీవనం. నూతన ఆదాయ మార్గాలు. ద్వితీయ తృతీయ వారాలలో ఆఖస్మిక కుటుంబ పరమైన ప్రయాణాలు. ప్రయనములందు చికాకులు. ధనాదాయంలో పెరుగుదల. మానసిక శ్రమ అధికం. ఈ మాసంలో 22 నుండి 29 తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవన సంతోషాలు.

ఫెబ్రవరి 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో పనులు నెమ్మదిస్తాయి. ఆర్ధికంగా కొంత అభద్రతా భావం. కుటుంబ సహకారం. వ్యపార వ్యవహారములు సామాన్యం. విదేశీ పర్యటనలు లేదా దురాక్షేత్ర సందర్శన. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. కొత్త ఆలోచనలు గుర్తింపునిచ్చును. సృజనాత్మకత ఉపయోగపడును. సంతాన విషయాలు కొద్దిపాటి ఆందోళన కలిగించును.

మార్చ్ 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమార్ధం ఆహ్లాదకరంగా ఉండును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. ద్వితియార్ధంలో ఉద్యోగస్తులకు చేతినిండా పని. అవిశ్రాంతంగా పని చేయవలసిన పరిస్టితులు. పనిపై శ్రద్ధాసక్తులు లోపించును. శ్రమకు గుర్తింపు ఉండదు. ధనాదాయం సామాన్యం. ఆదాయ మార్పిడి ప్రయత్నాలు విఫలం అగును. సహోద్యోగుల వలన సమస్యలు. ఈ మాసంలో 18,19,20 తేదీలు అనుకూలమైనవి కావు.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.