Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 08, రాజ పూజ్యం - 05, అవమానం - 04

  • పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సౌకర్యవంతమైన జీవనం ఏర్పడుటను సూచిస్తున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Cancer sign / Karkataka Rasi Nature....

కర్కాటక రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండ 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా గత సంవత్సరం మాదిరిగానే ఆశించిన ఆయుర్ ఆరోగ్య భాగ్యములు సంపూర్ణంగా లభించును. గురువు కర్కాటక రాశి వారికి విశేష యోగావంతమైన జీవనం ప్రాప్తింప చేయును. విశేషమైన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనేక పుణ్య కార్యములు మీ చేతిపై పూర్తీ అగుట, చక్కటి పేరు ప్రతిష్టలు ప్రాప్తించుట జరుగుతుంది. వారసత్వ సంపద లభించుట వలన ఆర్ధికంగా సంపూర్ణ యోగం అనుభవిస్తారు.

కర్కాటక రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని అంత అనుకూల ఫలితాలు ఇవ్వరు. అనవసర తగాదాలు ఎదుర్కొందురు. ఆరోగ్య సమస్యలు కూడా తరచుగా ఏర్పడును. ఆనారోగ్యత వలన ధన వ్యయం కూడా అధికం అగును. తరచుగా శ్రీ శనైచ్చరునికి తైలభిషేకాలు జరిపించుకోనుట మంచిది. కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. 

కర్కాటక రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభించును. స్వార్జిత ధన సంపద, వారసత్వ ధన సంపద రెండూ పెరుగును. ముఖ్యంగా పితృ వర్గం వారితో ఉన్న సమస్యలు తగ్గుతాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి.

కర్కాటక రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన కూడా కలసి వస్తుంది. కెరీర్ పరంగా, ఆర్ధిక పరంగా, జీవితంలో అభివృద్ధి ఎదురవుతుంది. సోదరి వర్గం వారికి మాత్రం ఈ సంవత్సరం అంత మంచి కాలం కాదు. వారు వ్యక్తిగత జీవితంలో ఒక తీవ్ర నష్టం ఎదుర్కొనే సూచన ఉంది.

ఏప్రిల్ 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగా ఉండును. భూ లాభం , అదృష్టం, వ్యపారాదులలో అధికమైన ధనప్రాప్తి. సుఖసంతోషాలు. విందులు, వేడుకలలో పాల్గోనేదురు. వస్త్ర లాభం. మనస్పర్ధలు తొలగును. 16, 17, 18, 19 తేదీలు నూతన వ్యాపార వ్యవహారములకు మంచివి.ఈ మాసంలో లోహ సంబంధ వ్యాపారములు మినహా ఇతర రంగ పెట్టుబడులు లాభించును.

మే 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలమైనది. ఆశించిన సంబంధాలు లభించును. చక్కటి జీవిత భాగస్వామిని పొందుదురు. సోదరి వర్గం విషయంలో ఒక అశాంతి. అకారణంగా ధనాన్ని ఖర్చు చేయు పరిస్టితులు. వ్యాపార, వృత్తి జీవనం చేయువారికి ఆదాయం సామాన్యం. 22 నుండి 25 వ తేదీల మధ్య ప్రయాణాలు, ప్రయత్నాలు ఫలవంతం అగును. పనులు సకాలంలో పూర్తి అగును. ఆర్ధికంగా వ్రుద్ధి. చివరి వారంలో నూతన వాహన భాగ్యం లేదా విలాసవంతమైన జీవనం.

జూన్ 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఏర్పడును. జీర్ణ సంబంధమైన అనారోగ్యంతో బాధపడు వారికి ఉపశమనం. ధనాదాయం కొద్దిగా తగ్గును. వ్యాపార రంగంనకు సామాన్య ఆదాయం. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి, సమయపాలనలో విఫలమగుట. ద్వితీయ తృతీయ వారాలలో ధనాదాయం సామాన్యం. విద్యార్ధలకు శ్రమ అధికం. 22వ తేదీ తదుపరి పరిస్థితులు అనుకులమగును. ధనాదాయం కొంచెం పెరుగును. ప్రయాణాలు ఫలించవు. వృధా ప్రయాణాలు ఏర్పడును. సొంత మనుష్యుల వలన మానసికంగా ఆవేదన.

జూలై 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో శని ప్రభావం వలన సమస్యలు ఏర్పడును. స్థిరాస్థి నష్టం లేదా తగాదాలు. ప్రయత్నాలలో సమస్యలు. పట్టుదల లోపించును. తోటి ఉద్యోగులతో వ్యతిరేకత. ఆలోచనలు ముందుకు సాగవు. అనవసరమైన విషయాల వలన అశాంతి కొనసాగును. ఈ మాసంలో శనివారముల నాడు ఉపవాసం ఉండుట, శనికి తైలాభిషేకాలు జరిపించుకోనుట మంచిది.

ఆగష్టు 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో శనికి శాంతి జపములు జరిపించుట మంచిది. సంతాన సంబంధ ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు. ధనాదాయం సామాన్యం. చేపట్టిన పనులు కష్టం మీద పుర్తిఅగును. ఉద్యోగులకు సమస్యలు. 13వ తేదీ తదుపరి అధిక ఖర్చులు. కార్యములందు వేగం మందగించును. ఉద్యోగ మార్పిడికి లేదా పదోన్నతికి చేయు ప్రయత్నాలు ఫలించవు. ఈ మాసంలో 26,27,28,29 తేదీలు వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైనవి.

సెప్టెంబర్ 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా అంత అనుకూలమైనది కాదు. స్వప్నములలో సర్ప దర్శనం పొందుచున్నవారు సర్ప శాంతి జరిపించుకోనుట మంచిది. చేపట్టిన పనులు కష్టం మీద విజయవంతం అగును. ధనాదాయం సామాన్యం. ఇతరులకు ఋణములు ఇవ్వడం మంచిది కాదు. మిత్రవర్గం నుండి సహకారం సమయానికి అందదు. సాహసోపేతమైన నిర్ణయాలకు ఈ మాసం అనుకూలం కాదు.

అక్టోబర్ 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అన్ని విధాల అనుకూల ఫలితాలు ఏర్పరచును. పరిస్థితులు అనుకూలంగా మారును. సంతాన ప్రయత్నాలు ఫలించును. నూతన పరిచయాల వలన లాభాపడుడురు. ఉద్యోగ, వ్యాపార వృత్తి పనులు సామాన్యం. తృతీయ వారంలో పనులు నిదానంగా పూర్తి చేయగలరు. నిరుత్సాహం కొంత తగ్గును. చివరి వారంలో కుటుంబంలో ఒక శుభకార్యం లేదా బంధు మిత్రుల కలయిక.

నవంబర్ 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా నడచును. ధనాదాయం వ్రుద్ధి చెందును. సోదర వర్గం వారికి మంచిది. ఆశించిన కార్య ఫలం లభించును. వివాహ ప్రయత్నాలు ఫలించును. శత్రు విభేదాలు తొలగును. స్పెక్యులషన్ లాభించదు. అవసరాలకు తగిన ధనం సర్దుబాటు జరుగును. గతకాలపు ఋణాలు తిరిగి చెల్లించగలరు. పరిస్థితులు చక్కబడును. 14 వ తేదీ తదుపరి ఉద్యోగ జీవనంలో ప్రశంసలు. నూతన వ్యాపారాలు లాభించును. కుటుంబ జీవనంలో ఆనందాలు. మాసాంతంలో విందు వినోదాలు. లఘు విలాస యాత్రలు.

డిసెంబర్ 2023 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా అనుకూల వాతావరణం కొనసాగుతుంది. ఆశించిన ఫలితాలు కొనసాగును. ఆరోగ్య సమస్యలు తగ్గును. ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. 10 నుండి 19 వ తేదీ మధ్య కాలంలో చిన్న ప్రమాద సంఘటనకు సూచన. తృతీయ వారంలో ధన లాభం, అధికారుల సహకారం ఉన్నవి. మొత్తం మీద ఈ మాసం ప్రశాంతంగా ఉండును.

జనవరి 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈీ మాసం కూడా ఆశాజనకంగా ఉండును. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ సంబంధ ఆదాయం, విదేశీ ప్రయాణాలకు అనువైన కాలం. వ్యక్తిగత జీవనంలో మాత్రం కొద్దిపాటి సమస్యలు. ధనాదాయం బాగుండును. ఆశించిన స్థాన చలనం. నూతన బాద్యతలు లేదా పదవులు పొందుటకు సూచనలు కలవు. శ్రమకు తగిన గుర్తింపు లభించును. ఈ మాసంలో 11,13,27,29 తేదీలు అనుకూలమైనవి కావు.

ఫెబ్రవరి 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపార వృత్తి జీవనదారులకు పనులు విజయవంతం అగును. ధనాదాయం బాగుండును. ప్రయత్నాలు లాభించును. ఈ మాసంలో కూడా వ్యక్తిగత జీవనంలో మాత్రం సమస్యలు కొనసాగును. ఉద్యోగంలో ఉత్సహపురిత వాతావరణం ఉంటుంది. నూతన గృహ లేదా గృహమార్పిడి ప్రయత్నాలు ఫలించును. ఆపదలు నుండి తప్పించుకొందురు. చివరి వారం ప్రారంభం నుండి భోగ భాగ్యములు అనుభవించెదరు. వంశ గౌరవం పెరుగును.

మార్చ్ 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అనుకూలమైన గ్రహ బాలలను కలిగి ఉన్నది. పుష్యమి నక్షత్రం వారికి ఈ మాసం సంతాన విషయాలలో లాభములను, ఆర్ధిక స్థిరత్యాన్ని ఏర్పర్చును. నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగం ఆశించిన విజయాలు ఈ మాసం ఏర్పరచును. సంతృప్తికరమైన జీవితం ఏర్పడును. శ్రమ భారం తగ్గును. కుటుంబంలో సంతోషాలు, ఆనందకర సంఘటనలు. కార్య సిద్హి.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.