Placeholder image

2023-2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు

Sree Shobhakruth Nama Samvatsara Dhanur Rasi / Sagittarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం- 08, వ్యయం - 11, రాజ పూజ్యం - 06, అవమానం - 03

  • పూర్వ పద్దతి లో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గత సంవత్సరం వలనే సౌఖర్యవంతమైన జీవనాన్ని కలిగి ఉండుటను సూచిస్తుంది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Dhanur Rasi / Sagittarius's Sign Nature...

ధనుర్ రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అనగా 22-మార్చ్-2023 నుండి 08-ఏప్రిల్-2024 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అతి చక్కటి ఫలితాలు ఏర్పడుతాయి. నూతన విషయాల్లో పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది. గృహ లేదా భూ సంపద ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల వలన లాభ పడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగ అన్వేషకులకు ఈ సంవత్సరం తప్పక ప్రభుత్వ కొలువు లభిస్తుంది. ఈశ్వర ఉపాసన సకల లాభములను కలుగ చేస్తుంది. ధనుర్ రాశి వారికి గురువు శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అఖండమైన అనుకూల ఫలితాలు కలుగచేస్తారు.

ధనుర్ రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో శని వలన కూడా చక్కటి అనుకూల ఫలితాలే ఏర్పడతాయి. ధైర్య స్థైర్యముల తో ఎటువంటి క్లిష్ట పరిస్టితిని అయినా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పరాక్రమం తో కూడిన విజయం సదా మీ సొంతం అవుతుంది.

ధనుర్ రాశి వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును. 29-అక్టోబర్-2023 వరకూ ఒక్క సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన అన్ని విషయాలలో అనుకూల ఫలితాలు కలుగచేయును. ఆర్ధికంగా అనుకూలమైన కాలమును ప్రసాదించును. 30-అక్టోబర్-2023 నుండి అంతగా మంచి కాలం కాదు. విద్యార్ధులకు శ్రమ అధికం అగును. భూ సంబంధ విషయాల్లో ఒక చిన్న నష్టం ఎదుర్కొందురు.

ధనుర్ రాశి వార్కి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన సంవత్సరం అంతా చక్కటి సులువైన ధనార్జన ఏర్పడును. కాలం యోగిస్తుంది.

ఏప్రిల్ 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సంతాన సంబంధ ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. గృహంలో బంధు కలయిక. సంతోష కార్యములు. ద్వితీయ వారంలో ఉద్యోగస్తులకు విధుల్లో చికాకులు. వ్యాపార రంగంలోని వారికి దూర ప్రాంత ప్రయాణాలు లాభం కలుగచేయును. తృతీయ వారం నుండి పనిలో ఉత్సాహం. కెరీర్ పరంగా నూతన అవకాశాలు. అవివాహితులకు వివాహ సూచనలు. చివరి వారం ప్రయత్నాలుకు , అధికారులను కలువుటకు, మధ్యవర్తిత్వానికి అనుకూలం.

మే 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసం కళాకారులకు మంచి ప్రోత్సాహవంతమైన కాలం. ధన వ్యయం కొంచెం పెరుగును. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నములు ఫలించును. గృహంలో ఒక ఆందోళన. ఎదురుచూస్తున్న సమాచారంలో నిరాశ. 10 నుండి 16 వ తేదీల మధ్య కాలంలో సొంత వాహన ప్రయత్నాలు లాభించును. ఉద్యోగులకు పురస్కారాలు. 25,26,27 తేదీలలో చిన్న అనారోగ్యం. 20.21 వ తేదీలు మైత్రీ సంబంధ వ్యవహారాలకు అనుకూలం.

జూన్ 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆకస్మిక వివాదం లేదా తగవుల వలన ఆశాంతి. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయాలు. తన్ములక బాధలు. ధనాదాయం సామాన్యం. 16 వ తేదీ తదుపరి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం. వ్యాపారులకు ఆర్ధిక లావాదేవీలకు ఆశాజనకంగా ఉండును. రాజకీయ వర్గముల వారికి పురోగతి. 28,29,30 తేదీలలో కొద్దిపాటి వ్యయ ప్రయాసలు. ఒత్తిడితో కూడిన వాతావరణం. అజమాయిషీ చేయుట వలన నష్టములు. ఇతరులకు సంబంధించిన కార్యములందు ఈ రాశి వారు పెద్దరికం వహించకుండా ఉండుట మంచిది.

జూలై 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ, ద్వితీయ వారాలలో మానసిక చికాకులు. వ్యక్తిగత జీవితం కూడా అంతగా బాగోదు. ఊహించని సంఘటనలు. వ్యాపార వ్యవహారాలు ఆటంకములతో కొనసాగును. ధనాదాయం సామాన్యం. స్నేహితులతో విరోధాలు. అభిప్రాయాలూ కలవవు. ఆలోచనలు కలసిరావు. విద్యార్ధులు, నిరుద్యోగుల కృషి అంతగా ఫలించవు. తృతీయ వారం నుండి స్వల్ప ధనలాభం. వ్యాపార వ్యవహారములు సామాన్యం. ప్రయాణాల్లో ఆటంకాలు. చివరి వారంలో శుభవార్తలు. ఆశించిన ప్రశాంతత.

ఆగష్టు 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నూతన ఆదాయ ప్రయత్నాలు లేదా విదేశీ ఆదాయ ప్రయత్నాలు ఫలించును. చేపట్టిన వ్యవహారములండు విజయం. వ్యక్తిగత జీవితంలో సమస్యలు కొనసాగును. ధనాదాయం బాగుండును. పితృ వర్గం వారి వలన లాభాలు. స్థాన చలన ప్రయత్నాలు లాభించును. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. మాస మధ్యమం నుండి గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. విడిపోయిన బంధువుల వలన అపఖ్యాతి లేదా వారిచే గౌరవ హాని.

సెప్టెంబర్ 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మనోవంచ్చా ఫలసిద్ధి. సంతాన సౌక్యం. వాహన యోగం. ధనాదాయం బాగుండును. వ్యపార వ్యవహారములందు విజయం. నూతన ప్రయత్నాలు లాభించును. బంధు వర్గం వలన కొద్దిపాటి సమస్యలు. 10 నుండి 15 వ తేదీ మధ్య పనిభారం అధికం అగును. అనవసర విషయాలకై సమయం వృధా. తృతీయ వారంలో జీవితంలో ఒక ప్రధానమైన మార్పు ఏర్పడు గ్రహ సూచన. ఈ మాసంలో 19,20 తేదీలలో అననుకులత.

అక్టోబర్ 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవితంలో సంతోషం బాగుండును. వ్యాపారులకు, ఉద్యోగ జీవనంలోని వారికి ఆఖస్మిక సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. కుటుంబ సభ్యుల సహకారం సమయానికి అందును. 18 వ తేదీ తదుపరి ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు తొలగును. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు మాత్రం కలసిరావు. చివరి వారంలో ఆదాయంలో పెరుగుదల. గత అనుభవాల వలన సమస్యల నుండి తప్పించుకొండురు.

నవంబర్ 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో దీర్ఘకాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం. పట్టుదలతో వ్యవహర విజయం. గృహంలో సంతోష కార్యములు. సంతాన సౌఖ్యం. ధనాదాయం బాగుండును. స్త్రీలకు ఆశించిన ఫలితాలు. శత్రు ఓటమి. కోర్టు వ్యవహారాలు అనుకూలత. వ్యాపారాలకు కలసివచ్చును. ఉద్యోగులకు సామాన్య ఫలితాలు. కార్య సిద్ధి. కొత్త ప్రాజెక్టులు పొందేదురు. ఈ మాసంలో ద్వితీయ వారం అనుకూలమైనది.

డిసెంబర్ 2023 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా ప్రారంభంలో చక్కటి ఫలితాలు ఇచ్చును. గౌరవ మర్యాదలు పెరుగును. వ్యవహారాలు విజయవంతము అగును. కర్ణ సంబంధ సమస్య. స్నేహితుల వలన లాభించును. తృతీయ వారం నుండి ధన వ్యయం కొద్దిగా అధికం అగును. ఆరోగ్యం కొంత సమస్యాత్మకంగా ఉండును. వ్యాపారాలు అంతగా కలసి రావు. ఉద్యోగస్తులకు విమర్శలు, కొద్దిపాటి ఒత్తిడితో కూడిన కాలం. అవిశ్రాంతంగా పనిచేయవలసి వచ్చును. మాసాంతంలో దూర ప్రయాణాలు, శారీరక విశ్రాంతి. ఈ మాసంలో 12,13,15 మరియు 17 తేదీలు అనుకూలమైనవి కావు.

జనవరి 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. పనులలో సామాన్య ఫలితాలు. అనవసర సమస్యలు. చికాకులు. ధన పరమైన ఒత్తిడులు. ఆలోచనలలో అస్థిరిత. ఉద్యోగ జీవనంలో ఆఖస్మిక మార్పులు. ప్రయాణాలలో జాగ్రత్త మరియు సమయ పాలన అవసరం. కుటుంబ సహాయం. కర్షక వర్గానికి శ్రమధిక ఫలం. 20 వ తేదీ తదుపరి పరిస్థితులలో మెరుగుదల. చురుకైన పాత్ర వలన గుర్తింపు.

ఫెబ్రవరి 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసం అంత ప్రోత్సాహకరమైన కాలం కాదు. ఆరోగ్య పరంగా లేదా మానసిక ఆందోళన వలన స్తబ్ధత. కుటుంబ సభ్యుల వలన తగాదాలు. ఆదాయంలో తగ్గుదల. ఊహించని విధంగా ఆర్ధిక వ్యయం. విధి నిర్వహణలో సమస్యలు.

మార్చ్ 2024 ధనుర్రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆర్ధిక భారం నుండి కొద్దిపాటి ఉపశమనం. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి అగును. విద్యార్ధులకు మంచి కాలం. వాహనాల విషయమై ఖర్చులు. ఉద్యోగులకు ఆశాభంగం. తృతీయ , చతుర్ధ వారాలలో వృధా వ్యయం. శ్రమ అధికం అగును. సన్నిహితులకు లేదా జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసి వచ్చుట. చెడు కలలు. ఈ మాసంలో 4,7,13,18,29 తేదీలు మంచివి కావు. జాగ్రత్త అవసరం.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.