Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 14 వ్యయం - 11 రాజపూజ్యం - 06 అవమానం - 01.
  • పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "0". ఇది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఎదుర్కోనబోయే ఆర్ధిక , గౌరవ సంబంధ హాని లేదా నష్టాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Vrushbha Rasi / Taurus Sign...

వృషభరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం వలన అంత అనుకూలమైన ఫలితాలు ఏర్పడవు. ఆశించిన విజయాలలో అర్ధ ఫలితాలు , వృధా వ్యయములు, చేపట్టిన పనులలో అనేక ఆటంకములు, విద్యాభ్యాసంలో విఘ్నములు, పరదేశ ప్రయాణ విషయాలలో సమస్యలు వంటి ఇబ్బందులను ఏర్పరచును. ముఖ్యంగా 20 నవంబర్ 2020 నుండి వ్యతిరేక ఫలితాలు అధికం అగును. ఉద్యోగ జీవనంలో ప్రతికూల మార్పులు, పూర్వపు యోగం చెడిపోవడం వంటి తీవ్ర సమస్యలను ఏర్పరచును.

వృషభరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని గ్రహం మంచి ఫలితాలను కలుగచేయును. ఈ సంవత్సరం వృషభ రాశి వారు కేవలం శని గ్రహం వలన మాత్రమె అనుకూల ఫలితాలు పొందుదురు. వ్యక్తిగత జాతకంలో శని గ్రహం బలమైన స్థానంలో ఉన్నవారికి పైన గురుగ్రహం వలన పేర్కొన్న సమస్యలు ఏర్పడవు. వ్యక్తిగత జాతకంలో బలమైన శని ఉన్న వృషభ రాశి వారికి ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు, వాహన ముద్రిధికార యోగమును, సమాజంలో మిక్కిలి పేరు ప్రతిష్టలను , ఆశించిన దానికంటే అధిక ధనదాయమును, శ్రీ శార్వరి నామ సంవత్సరంలో సదా సత్కధా కాలక్షేపమును ఏర్పరచును. వృషభ రాశి వార్కి ఏలినాటి శని దశ లేదు.

వృషభరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహువు అనుకూల ఫలితాలు కలుగచేయడు. వాహన ప్రయనములందు ప్రమాదములను, విష క్రిమి కీటకాదుల వలన ప్రమాదములను, వారసత్వ పరమైన సంపదలో ఖర్చును లేదా నష్టములను ఏర్పరచును.

వృషభరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కేతు గ్రహం కూడా యోగించడు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు, వివాహితులకు కళత్ర జీవనంలో సమస్యలను, కోర్టు కేసులందు అపజయములను ఏర్పరచును. బంధు వర్గములో నూతన శత్రుత్వములను ఏర్పరచును. స్వ ఆరోగ్య విషయలందు కూడా ఇబ్బందులను కలుగచేయును.

మార్చి 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో కుటుంబ సంబంధాలు మెరుగవును. విలాసవస్తువుల కొరకు ధనం వెచ్చించేదురు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పాత ఋణాలు తీర్చివేసేదురు. ఆర్ధిక లక్ష్యాలు పూర్తిచెయగలరు. విదేశీ ప్రయత్నాలు విఘ్నాలు పొందేదును. ధనాదాయం వృద్ధి చెందును. జీవిత భాగస్వామితో సఖ్యత - సౌఖ్యం. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. అపరిష్కృతంగా ఉన్న తగాదాలు పరిష్కారమగును. ధనాదాయం ఆశించినంత ఉండును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అగును. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా వాహన సంబంధ వ్యాపారాలు చేయువారికి బాగా కలసి వచ్చును. ఈ మాసంలో 9 వ తేదీ నుండి 17 వ తేదీ మధ్య కొద్దిపాటి వృధా ధన వ్యయం మరియూ అనారోగ్య సూచన. 19, 20, 21 తేదీలు వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలం. 27 నుండి మాసాంతం వరకూ ఉద్యోగ జీవనంలో శ్రమ అధికమగును. ఒత్తిడులు ఎదుర్కొందురు. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసం ప్రధమ అర్ధ భాగంలో వైవాహిక జీవనంలో పట్టుదల, ఉద్రిక్తతలు ఎదుర్కొందురు. భూ సంబంధ కొనుగోలు ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు విఫలమగును. ఉన్నత అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. గత మాసపు ఉద్యోగ జీవన ఒడిదుడుకులు తొలగును. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉండును. నిరుద్యోగులు మరింత దీక్షా , పట్టుదలను ప్రదర్శించాలి. చివరి వారంలో ఆత్మీయులతో ఉన్న వివాదాలు సర్దుబాటు చేసుకొందురు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను కష్టం మీద చివరి నిమిషానికి పూర్తీ చేయగలుగుతారు. స్నేహితులు సహకారం లభించును. రాజకీయ రంగంలోని వారికి ఊహించని అవకాశములు లభించును. ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు లాభించును. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యక్తిగత జీవన విషయాలలో సౌఖ్యం ఉన్నది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలనుండి ఉపశమనం లభించును. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. సామజిక కార్యక్రమాలలో మీ శ్రమకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. గౌరవింప బడతారు. స్థాన చలన ప్రయత్నాలు , ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు లాభించును. నిరుద్యోకులకు ద్వితీయ, తృతీయ వారములలో మంచి అవకాశములు లభించును. రాజకీయ పలుకుబడి పనికి వచ్చును. పేరు - ప్రతిష్టలు సంపాదించుకొందురు. స్త్రీలకు నూతన వస్తు - ఆభరణాలు ప్రాప్తించును. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యాపార వ్యవహారములు ఆశించిన విధంగా కొనసాగును. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో ఆర్ధిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండదు. వృత్తి జీవనంలో పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొందును. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగచేయును. భాత్రు వర్గం వారి సహకారంతో సమస్యలు పరిష్కారమగును. 10వ తేదీ తదుపరి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును. నూతన అవకాశములు లభించును. వివాహ ప్రయత్నాలు విజయవంతం అగును. వ్యాపార విస్తరణ అవకాశములు లభించును. విదేశీ విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్నపుర్వక లాభం ఏర్పడును. ఈ మాసంలో 2, 3, 8, 13 తేదీలు అంత అనుకూలమైనవి కావు. ఈ మాసం మొత్తం మీద ధనాదాయం కొంత తగ్గును. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో ధన వ్యయం తగ్గును. దూరప్రాంత జీవన ప్రయత్నాలు చేయు వారు ఆటంకములు ఎదుర్కొందురు. ఈ మాసంలో మాతృ వర్గీయులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు కలవు. అఖస్మిక ప్రయాణాలు ఏర్పడును. నూతన ఆలోచనలు, వ్యాపార లావాదేవీలు సమస్యలతో కొనసాగును. ఉద్యోగ జీవనంలో కూడా ఊహించని సమస్యలు ఇబ్బంది పెట్టు సూచన. విలువైన వస్తువులు పోగొట్టుకొనే అవకాశము ఉన్నది. స్థాయిని మించిన సహాయములు చేయుట వలన చేతిలో ధనం నిలువదు. ఇతరుల సమస్యలలో కలుగాచేసుకోనుట వలన గౌరవ హాని సూచనలు కలవు. ముఖ్యంగా 15, 16, 17 తేదీలలో సమన్వయంతో వ్యవహరించుట మంచిది. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గును. నూతన వ్యాపార వ్యవహారాలు మాత్రం సమస్యలు కలిగించును.స్నేహ వర్గం నుండి ఆశించిన సహకారం ఉండదు. స్వతంత్రంగా వ్యవహారములు చక్కపెట్టుకోవాలి. స్నేహితులపై ఉన్న నమ్మకం దెబ్బతినును. ప్రముఖుల నుండి ఆహ్వావానాలు అందును. విద్యార్ధులకు కోరకున్న విద్యా ప్రవేశాలు లభిస్తాయి. పుణ్య క్షేత్ర సందర్శన ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొందురు. ఈ మాసంలో 9 నుండి 20 తేదీ మధ్యకాలం వివాహ - సంతాన- నూతన గృహ నిర్మాణ సంబంధ పనులు చేయుటకు అనువైన కాలం. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో ధన ఆదాయం అవసరములకు సరిపోతుంది. కుటుంబ పరమైన ఖర్చులు అధికం అగును. గృహంలో శుభ కార్యములు నిర్వహించెదరు. సంతానానికి సంతోషాన్ని కలుగచేయుదురు. నూతన కార్యములకు రూపకల్పన చేయుదురు. ఉద్యోగ జీవనం సాఫీగా కొనసాగును. సంతన లేమీ దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందును. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తిగత వ్యవహార సమస్య తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయం మీద ఆధారపడిన వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూలత ఎదురగును. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో ప్రారంభ వారములు అనుకూల ఫలితాలు ఇచ్చును. తృతీయ వారం నుండి వ్యతిరేక ఫలితాలు ప్రారంభం అగును. వైవాహిక జీవనంలో తీవ్ర మార్పులు , సమస్యలు ఏర్పడును. కోర్టు వ్యవహారాలలో ప్రతికూల తీర్పులు. ధనం వృధాగా వ్యయం అగును. వృత్తి - వ్యాపారములందు చాలా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. రాబోవు కాలం అంత అనుకూలమైనది కాదు. ఈ మాసంలో రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం, వివాహాలు కుదుర్చుకోవడం, స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరపడం, నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ మాసం కూడా అనువైనది కాదు. ఈ మాసంలో 20, 21, 22, 23, 27,28 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకోని కలహాలకు అవకాశం ఉన్నది. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సున్నితమైన విషయాల్లో మానసిక ఆందోళన ఏర్పడును. ఈ మాసంలో 13, 14 తేదీలు మినహా మిగిలిన రోజులలో ప్రయాణాలు చేయవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు చివరి నిమిషంలో విజయవంతం అవుతాయి. వృత్తి జీవనం ద్వారా ధనార్జన చేయువారు జాగ్రత్తగా ఉండవలెను. మనో నిగ్రహాన్ని ప్రదర్శించాలి లేనిచో అపఖ్యాతి పాలగుదురు. ప్రస్తుత హోదాను కోల్పోవుదురు. అఖస్మిక వ్యవహార నష్టములకు సూచనలు కలవు. ఈ మాసంలో గురు గ్రహ శాంతి జపము జరిపించుకోనుట మంచిది. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. మానసికంగా ఇబ్బంది పెట్టె అనుభవాలు తరచుగా ఉండును. చేపట్టిన పనులలో తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొందురు. ద్వితీయ వారంలో వివాహ సంబంధ ప్రయత్నాలు విజయవంతం అగును. వాగ్ధాన భంగములు చేయకండి. ఉన్నత అధికారులతో మాటకలయికలో ఇబ్బందులు ఎదురగును. తృతీయ వారంలో సోదర వర్గం నుండి సహకారం లభించును. సంతాన సంబంధ శుభవార్త. అవసరములకు ధనం సర్దుబాటు అగును. ఈ మాసంలో 7, 8, 10, 12, 13, 17 తేదీలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనరాదు. అగ్రిమెంట్లు చేయరాదు. మానసిక ధైర్యం తగ్గును. 22 వ తేదీ తదుపరి కొంత వరకూ ఇబ్బందులు తగ్గును. పరిష్కార మార్గములు కనిపిస్తాయి. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో కుటుంబ సమస్యలు తగ్గుతాయి. మనస్పర్ధలు తొలగును. భాగస్వామ్య వ్యాపారములు ఈ మాసంలో కలసి వస్తాయి. వ్యాపారులకు ధనాదాయం పెరుగును. రుణాలు తీర్చగులుగుతారు. నూతన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ మాసంలో తీవ్ర ప్రతికూల ఫలితాలు, అనుకూలం కాని రోజులు లేవు. ప్రయాణాలు చేయుట వలన మానసికంగా ప్రశాంతత లభించును. నూతన ప్రణాళికలు రచించుకొందురు. కొత్త సంబంధాలు ఏర్పడును. బంధు వర్గానికి సహాయం చేసెదరు. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 వృషభరాశి రాశీఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం కొంత పెరుగును. నూతన గృహ నిర్మాణాలకు చేయు ప్రయత్నాలు ఫలించును. దీర్ఘాలోచనలు కలసి వచ్చును. వివాదాలలో రాజీలు చేసుకొందురు. నిరుద్యోగులకు కూడా ఈ మాసం ఆశాజనకంగా ఉండును. స్థాన చలన లేదా ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయవచ్చు. నూతన పెట్టుబడులు కలసి వచ్చును. మాస మాధ్యమంలో సువర్ణ లాభం ఉన్నది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ పెద్దలను మెప్పించగలరు. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.