Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు

Sree Sharvari Nama Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 05, రాజపూజ్యం - 03 అవమానం - 03.
  • పూర్వ పద్దతిలో వృచ్చిక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది వ్రుత్తి జీవనంలో లాభాన్ని , స్థాన ఉన్నతిని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Vrucchika Rasi / Scorpion Sign's Nature.....

వృచ్చికరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19 నవంబర్ 2020 వరకూ చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. ఆశించిన విధంగా ధనార్జనను ఇచ్చును. సన్మానములు పొందుదురు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందిన్చును. సంతాన ప్రయత్నాలు చేయువారికి సుందరమైన పుత్ర సంతానాన్ని ప్రసాదించును. 20 నవంబర్ 2020 నుండి పైన పేర్కొనిన ఫలితాలకు పూర్తి వ్యతిరేకంగా ఫలాలు ఇచ్చును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ దోషం కలిగిన వారు, నీచ క్షేత్రంలో గురువు ఉన్న వారు ఉద్యోగ నష్టమును, ఆర్ధిక విషయాలలో దారిద్రతను, సంతాన సంబంధ విచారతను ఎదుర్కొందురు.

వృచ్చికరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని వలన లాభ వ్యయములు సమానంగా ఏర్పడును. శని వలన వృచ్చిక రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. వృచ్చిక రాశి వారికి ఏలినాటి శని ఈ సంవత్సరంలో లేదు.

వృచ్చికరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన సంవత్సరం అంతా విశేష ధనార్జన కలుగచేయును. ఆర్ధిక విషయాలలో మినహా వ్యక్తిగత విషయాలలో అనగా వైవాహిక జీవనంలో ఇబ్బందులు, నూతన ప్రయత్నాలలో ఆటంకాలు, సర్ప గండం వంటి ప్రమాదాలను ఏర్పరచును. శారీరక అనారోగ్యముల వలన చికాకులు ఎదుర్కొందురు. పారమార్ధిక చింతణ అధికమగును.

మార్చి 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పుర్తిచేయవలసిన పరిస్థితులు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. నూతన ప్రయోగాలు చేయుటకు ఇది మంచి కాలం. ఉన్నత పదవులు పొందటానికి ఇది యోగావంతమైన కాలం. నూతన పారితోషకాలు అందుకోను సూచనలున్నాయి. చివరివారంలో ఆరోగ్య సమస్య లేదా శస్త్ర చికిత్స జరుగు అవకాశం కలదు. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జాతకులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింతగా ఇబ్బంది కలిగించును. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం ఉండదు. జీవిత భాగస్వామి సంబంధిత బంధు వర్గం వారితో విరోధములు ప్రారంభం అగును. గృహ సంబంధ స్థాన చలన ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. అనురాధా జన్మ నక్షత్ర జాతకులు మానసిక చాంచల్యత వలన చక్కటి అవకాశములను కోల్పోవుదురు. ఈ మాసంలో 18, 19 తేదీలలో వాహన ప్రమాద సూచన ఉన్నది. 22 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో జయం ఏర్పడును. కార్యాలయంలో కోరుకున్న సౌకర్యములు లభించును.చివరి వారంలో అన్నివిధములా పరిస్థితులు అనుకూలంగా ఉండును. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. వ్యాపార విస్తరణకు, నూతన ఆలోచనలు అమలుచేయుటకు ఈ మాసం కలసి వచ్చును. విదేశీ ప్రయత్నములు చేయుటకు, వివాహ ప్రయత్నములు - సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ఈ మాసంలో 3 వ తేదీ నుండి 15 వ తేదీ మధ్య కాలంలో ఆకస్మిక ప్రయాణములు ఏర్పడును. సోదర సోదరి వర్గీయులకు సంబందించిన ఇబ్బందుల వలన మానసిక చికాకులు. 19,20,21 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారములలో గౌరవ నష్టం. అపవాదులు బాధించును. చివరి వారంలో శారీరక శ్రమ అధికం అగును. నరముల సంబంధిత సమస్యలు ఇబ్బంది కలిగించును. తల్లితండ్రులతో కుటుంబ బాధ్యతలకై తగాదాలు. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన విధంగా పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లకు అవకాశములు ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఉన్నతి - నూతన భాద్యతలు లభిస్తాయి. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కొనసాగును. కుటుంబములో మీ మాట విలువ పెరుగును. విద్యార్ధులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. తృతీయ వారంలో విహార యాత్రలు, విందు - వినోదాల వలన సంతోషంగా సమయం గడచును. జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవనంలో సోఖ్యం. బాగా ఎదిగిన సంతానం వలన ఆర్ధిక లేదా వాహన ప్రయాణ సౌఖ్యం. కుటుంబ భాద్యతలను తీసుకొంటారు. స్థిరాస్తి తగాదాలలో రాజీ ప్రయత్నాలు ఫలించును. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. నూతనంగా ప్రారంభించిన వ్యాపారములో లాభములు పెరుగును. పోటీదారులు తొలగును. గుత్తేదారులకు భారి ప్రభుత్వ కాంట్రాక్టులు లభించును. సంతానానికి కొద్దిపాటి అనారోగ్యం వలన మనస్తాపం. పై అధికారుల సహకారంతో ఉద్యోగ జీవనంలో అనుకూల కాలం. సులువుగా లక్ష్యాలను పుర్తిచేయగలుగుతారు. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు. విదేశీ జీవన సంబంధ ప్రయత్నాలలో జాప్యం చికాకు కలిగించును. నూతన ప్రయత్నాలలో ప్రభుత్వ పరమైన అడ్డంకులు ఎదుర్కొందురు. తృతీయ వారం నుండి అన్ని విధాల సామాన్య ఫలితాలు పొందుదురు. ఈ మాసంలో 8, 10, 11, 13 తేదీలు అనుకూలమైనవి కావు. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో గృహంలో ఆకస్మిక శుభకార్యములు , విందు భోజనములు, అతిధుల ఆతిధ్య సంబంధిత వ్యయం ఎదుర్కొందురు. నూతన పరిచయాలు లాభించును. ఈ మాసంలో ప్రారంభ రోజులలో ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మాసాంతమునకు గురు గ్రహ బలం వలన తొలగును. తృతీయ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ జీవన సంబంధిత శుభవార్త. అందరి మన్ననలను పొందుతారు. మాసాంతంలో ఆశించిన ఫలితాలు ఏర్పడుతాయి. మొత్తం మీద ఈ మాసంలో ఆదాయం కన్నా వ్యయం అధికం అగును. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. నూతన పనులు ఆరంభించకూడదు. నష్ట పరచును. భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ విషయలాలో చికాకులు అధికం అగును. ద్వితియ వారంలో సంతాన సంబంధ లాభం. ధనదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఏర్పడును. కుటుంబంలో చక్కటి అనుకూల వాతావరణం. ఆనందకర సమయం. నాలుగవ వారం ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఏర్పడును. తలపెట్టిన పనులలో ఊహించని చికాకులు. ప్రయాణమూలక ఆరోగ్య సమస్యలు. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ప్రధమ అర్ధ భాగంలో ఇష్టమైన వ్యక్తులతో దూర ప్రయాణములు చేస్తారు. కుటుంబ అవసరాలకు ఆశించిన విధంగా ధనం సర్దుబాటు చేయగలుగుతారు. పుత్ర సంతానం వలన చక్కటి సౌఖ్యత ఏర్పడును. ద్వితియ అర్ధ భాగం నుండి అనగా 13, 14, 15, 16 తేదీలలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం ఏర్పడు సూచనలు అధికం. చిన్న చిన్న విషయాలలో ఇరుగుపొరుగు వారితో తగాదాల వలన చికాకులు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు. 17,18 తేదీలలో గౌరవ హాని. మాసాంతంలో ఉద్యోగ ఒత్తిడి వలన శ్రమ అధికం అగును. వివాహ సంబంధ ప్రయత్నాలలో ఒక అశుభ వార్త. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో నూతన ప్రారంభాలకు ఆశించిన ఋణాలు లభించును. శరీర ఆరోగ్యం కొంత ఇబ్బందులు కలుగచేయును. 14 వ తేదీ వరకూ ప్రయత్నములు సులువుగా విజయవంతం అగును. 14 వ తేదీ తదుపరి అతి కష్టం మీద కార్య విజయం ఏర్పడును. వ్యాపార విస్తరణకు 14 వ తేదీ తదుపరి అనుకూలమైన సమయం కాదు. ఈ మాసంలో పనులు పూర్తిఅవడానికి మధ్యవర్తుల పై ఆదరాపడకండి. అలసత్వం పనికిరాదు. కోర్టు వ్యవహారములు వాయిదా తీసుకోండి. గృహ వాతావరణంలో జీవన సంతోషములు మధ్యమం. ఈ నెలలో 18,25,30 తేదీలు మంచివి కావు. 5,6 తేదీలలో వివాహ ప్రయత్నములకు అనుకూలం. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం కొంచం తగ్గును. వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. ఆధార పడిన వారినుండి సహకారము లభించదు. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధనవ్యయం. తృతీయ వారంలో దైవదర్శన, పుణ్య క్షేత్ర సందర్శన ఫలితం ఏర్పడును. 21 వ తేదీ తదుపరి సంతాన ప్రయత్నాలలో శుభ వార్త. మాసాంతమునకు ఉద్యోగ పరిస్టితులలో కొంచం ప్రశాంతత లభించును. ఈ నెలలో 5,14,20,29 తేదీలు మంచివి కావు. ఈ తేదీలలో చేయు ప్రయాణములందు జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీలలో స్థిరాస్తి క్రయవిక్రయాలు కలసిరావు. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చేయు ప్రయత్నములలో ప్రారంభమున ఆటంకములు ఏర్పడినప్పటికీ అంతిమంగా విజయం లభించును. ధనాదాయం నెమ్మదిగా పెరుగును. గతకాలపు ఇబ్బందులు క్రమంగా తొలగును. ద్వితియ , తృతీయ వారములలో నూతన ఆదాయ మార్గములకై చేయు ప్రయత్నాలు లాభించును. కళత్ర మూలక ధనలాభం ఏర్పడును. వ్యక్త్రిగత జీవనంలో సౌఖ్యం. దూరపు బంధువులతో కలయిక వలన లాభం. 24 వ తేదీ తదుపరి వ్యాపారంలో గొడవలు. మానసిక అశాంతి. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చక్కటి ఆదాయమునకు సూచనలు కలవు. కెరీర్ పరంగా ఉన్నతి పొందుతారు. పెద్ద వయస్సు వారికి శరీర అరోగ్యం సహకరించదు. గత కాలపు పెట్టుబడుల నుండి రాబడి ప్రారంభమగును. పశు సంబంధ హాని. 14, 15, 16, 17 తేదీలలో కార్యానుకులత ఏర్పడును. ప్రభుత్వ రంగ ఉద్యోగం చేయువారికి వారికి చాలా అనుకూలమైన కాలం. గృహంలో మార్పులు చేయుటకు ఇది మంచి సమయం. 26, 27, 28, 29 తేదీలలో చేయు దూరప్రాంత నివాస ప్రయత్నములు లాభించును. ఆలోచనలు సక్రమ మార్గంలో ఉంటాయి. అభివృద్ధికర జీవనం ఏర్పడుతుంది. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 వృచ్చికరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా గత మాసం వలె అనుకూల ఫలితాలు ఏర్పడుతాయి. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.