Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు

Sree Sharvari Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 11, రాజపూజ్యం - 07, అవమానం - 07.
  • పూర్వ పద్దతిలో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "0". ఇది కుటుంబ విషయాలలో గొడవలను, ఆర్ధిక హానిని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Tula Rasi / Libra Sign's nature....

తులారాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం వలన సోదర సోదరీ వర్గముల వలన సహకార లేమి , ఉద్యోగ పరంగా వృద్ధి, వారసత్వ సంబంధ తగవులలో జయము, అనుకూల కోర్టు తీర్పులు, ఆశించిన భు లేదా గృహ సౌఖ్యము కలుగును. సంవత్సరం అంతా గురువు అనుకూల ఫలితాలు ఏర్పరచును.

తులారాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని గ్రహం వలన విశేషంగా కలసి వచ్చును. ఆరోగ్య పరంగా అతి చక్కటి అనుకూలత లభించును. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం సాంత్వన లభించును. వ్యక్తిగత జాతకంలో శని బలవంతుడై ఉన్నవారికి విశేషమైన భూ సంపదను లభింపచేయును. తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఏలినాటి శని లేదు.

తులారాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 24 సెప్టెంబర్ 2020 వరకూ అనుకూల ఫలితాలు ఇచ్చును. 25 సెప్టెంబర్ 2020 నుండి రాహువు వలన అనేక సమస్యలు ఎదురగును. ముఖ్యంగా ఆకస్మిక ఉద్యోగ నష్టములు, పిత్రువర్గీయుల వలన సౌఖ్య లేమి ఏర్పడును. వ్యక్తిగత జాతకంలో రాహు గ్రహ దోషం ఉన్న వారు 2020 అక్టోబర్ నుండి 2021 ఫిబ్రవరి వరకూ ఆర్ధికంగా మిక్కిలి ఇబ్బందులు ఎదుర్కొందురు. ఋణముల వలన గౌరవ హాని పొందేదురు.

తులారాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 2020 సెప్టెంబర్ వరకూ వ్యాపార వ్యవహారములందు, ఆర్ధిక విషయములందు, నూతన ప్రయత్నములందు అనుకూల ఫలితాలు కలుగచేయును. 2020 అక్టోబర్ నుండి వ్యతిరేక ఫలితాలు కలుగచేయును. ముఖ్యంగా సంతాన ప్రయత్నాలు చేయు వారికి ఇబ్బందులు కలుగచేయును.

మార్చి 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆర్ధికంగా అనుకూల ఫలితాలను, ఆరోగ్య పరంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు. సంతాన సంబంధ విషయాలు బాధ కలిగించు సూచన. సంతాన ఆరోగ్యం ఆందోళన కలిగించుటకు అవకాశం కలదు. ధనాదాయం బాగుండును. ద్వితీయ వారంలో కుటుంబ పరిస్థితులు గతి తప్పును. ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతో జాగ్రత్త అవసరం. నూతన రుణాలకు ఈ మాసంలో ప్రత్నించకుండా ఉండుట మంచిది. తృతీయ వారం ఉద్యోగ మార్పులకు , ఇంటర్వులకు అనుకూలమైన కాలం. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రధమ వారంలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. నూతన ప్రయత్నాలు తప్పక విజయవంతం అగును. వ్యాపార విస్తరణకు మిత్రులు కలిసి వస్తారు. మూలధనం సమకుర్చూకొగలరు. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. 17, 18, 19 తేదీలలో గతకాలపు ఋణ బాధలు తొలగును. నూతన లక్ష్యాలను నిర్దేసించుకుంటారు. చివరి వారంలో సామజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ మాసంలో శుభ ఫలితాలు ఏర్పడును. వ్యక్తిగత జీవనంలో మానసిక సంతోషం, తృప్తి లభించును. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆశించిన విధంగా నూతన జీవన విధానాలు ప్రారంభం అవుతాయి. ధనాదాయం సామాన్యం. ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేదా వేతన పెరుగుదల లభిస్తుంది. విద్యార్ధులకు చక్కటి సంకేతిక విద్యలో ప్రవేశం లభించును. 9, 10, 11, 12 తేదీలలో వివాహ సంబంధ లేదా సంతాన సంబంధ శుభవార్తలు వింటారు. పరోపకారం వలన ఇతరుల మన్ననలు పొందుతారు. వృత్తి జీవనంలో కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుచును. వినోద కార్యక్రమాలకై ధనం ఖర్చు అగును. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కుటుంబ వివాదాలు ఉన్నా ఆర్ధిక లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ వార్త. నూతన ప్రాజెక్ట్లు లభిస్తాయి. నూతన అధికారాలు పొందుతారు. వాహన యోగం ఉన్నది. గృహంలో కుటుంబ సభ్యులతో సామరస్యంతో వ్యవహరించాలి. విదేశీ జీవన ప్రయత్నాలలో సమస్యలు ఎదురగును. తృతియ వారంలో వృధా ప్రయాణాలు చేస్తారు. సమయ పాలనలో విఫలమవుతారు. శారీరక శ్రమ వలన అశాంతి కలుగును. చివరి వారంలో మీ చేతిపై పుణ్యకార్యములు జరుగును. శుభ కార్యములకు ధనం వ్యయమగును. స్త్రీలకు స్థిరాస్తి సంబంధ లాభం ఏర్పడును. గురువుల ఆశీస్సులు లభించును. ఈ మాసంలో 2, 17, 23, 24 తేదీలలో పితృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలు. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సువర్ణ లేదా అధునాతన పరికరాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ జీవనం సామాన్య యోగాన్ని కలుగచేయును. ఆలోచనా విధానం బాగుండును. ఈ మాసంలో కూడా కుటుంబ సమస్యలు మానసికంగా చికాకులు కలుగచేయును. రక్త సంబంధీకుల పట్ల అభిమానం అవసరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన సంబంధిత విషయాలలో ప్రతికూల ఫలితాలు ఏర్పడును. ఈ మాసంలో 29, 30 తేదీలలో తలపెట్టు నూతన కార్యములు జయప్రదంగా కొనసాగుతాయి. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో అధికారుల వలన వేధింపులు, ఒత్తిడి పెరుగు సంఘటనలు. వ్యక్త్రిగత జీవితంలో సౌఖ్యం తగ్గును. ముఖ్యంగా భాత్రు వర్గం వలన మానసిక అశాంతి. కుటుంబ పరంగా భూ లేదా స్థల సంబంధమైన నష్టం ఏర్పడుటకు సూచనలు అధికం. నేత్ర సంబంధ సమస్యల వలన ఇబ్బందులున్నాయి. 13 నుండి 18 వ తేదీ మధ్య కాలంలో గౌరవం దెబ్బతినును. జీవన దారిలో సమస్యలు ఎదురగును. 29, 30 తేదీలలో ఆరోగ్య సమస్యలు వలన ఖర్చులు, నిరాశాజనక వాతావరణం. అశుభ వార్తలు వినవలసి వచ్చును. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా వ్యాపార వ్యవహరాదులలో ఆశించిన ఫలితాలు ఏర్పడుట కష్టం. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. తోటి ఉద్యోగుల వలన తీవ్ర ఇబ్బందులు. ఆర్ధిక అపవాదులు ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టంపై ఫలించును. వ్యాపార వ్యవహారములలో అననుకూల మార్పులు జరుగును. పుష్ప సంబంధ వ్యాపారం చేయువారికి జీవనాధారం దెబ్బతింటుంది. లభించిన అవకాశములతో తృప్తి పడవలెను. నాయకులకు పదవీభంగం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రధమ వారంలో సంతాన సంబంధ లాభములు ఏర్పడును. సంతానానికి ఉద్యోగ లాభం ఏర్పడును. గత కాలపు సమస్యల నుండి కొంత ఉపశమనం లభించును. కుటుంబ సంబంధాలు కొంత మేరుగవును. స్నేహ పూర్వకంగా మాట్లాడడం వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల వలన నూతన ప్రయత్నాలు లాభించును. విమర్శల నుండి బయట పడతారు. పెద్దల అనుభవం ఉపయోగపడుతుంది. ఫైనాన్సు వ్యాపరం చేయువారికి ఈ మాసం కలసిరాదు. పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోవుదురు. మాస ద్వితియార్ధంలో కోర్టు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆశించిన గుర్తింపు పొందుతారు. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో నూతన భాద్యతలు లభించి వాటికి అనుగుణంగా వ్యవహరిస్తారు. ప్రత్యర్ధుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవన మార్గంలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అధికం అవుతాయి. యాత్రసంబంధ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. వ్యాపార రంగాల్లో చక్కటి అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. దేవతా ప్రతిష్ట వంటి దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల విశ్వాసం సంపాదించుకొంటారు. నూతన విషయాలలో నిర్ణయాలను వాయిదా వేయకుండా ఉండుట మంచిది. ఈ మాసంలో 13, 14 , 19, 25 తేదీలలో నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సంతోషకరమైన వైవాహిక జీవన యోగములు ఉన్నవి. గృహంలో బంధువుల కలయిక, సంతోషకర వాతావరణం. ధనాదాయం సామాన్యం. కుటుంబ ఆశయాలు నేరవేర్చుదురు. మొత్తం మీద ఈ మాసంలో ఆశించిన సంతోషాలు పొందుతారు. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనధాన్య లాభములు ఉన్నవి. మనో అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరమైన మార్గంలో కొనసాగును. ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది. మంచి భవిష్యత్ కు పునాదులు వేసుకొంటారు. కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సంతాన విషయమై వైద్య సహాయం తీసుకొంటారు. ముఖ్య వ్యక్తులతో చర్చలు ఫలప్రదమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గంభీరంగా వ్యవహరించాలి. చివరి వారంలో కోర్టు కేసులు కొట్టివేయబడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఒక శస్త్రచికిత్స ఏర్పడును. ప్రధమ అర్ధ భాగంలో గృహంలో చొరభయం. ఉద్యోగ జీవనంలో కార్యభారం పెరుగుట. దూరప్రాంత ప్రయాణములు అనుకూలంగా ఉండవు. ప్రేమ వ్యవహారాలలో మనోవేదన. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యం. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములు అన్వేషిస్తారు. ఎదిగిన పుత్ర సంతనముతో కొద్దిపాటి అభిప్రాయ బేధాలు ఏర్పడును. ఉద్యోగ జీవన ఫలితాలు సామాన్యం. ఈ మాసంలో 1, 3, 4, 16, 27 తేదీలు అనుకూలమైనవి కావు. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 తులారాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో పనులలో విఘ్నములు క్రమేపి తగ్గుముఖం పట్టును. ధనాదాయం సామాన్యం. ఉద్యోగ ప్రయత్నాలు, స్థిర నివాశ మార్పులకై చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. 13, 14, 15 తేదీలలో వాహన సంబంధ తగాదాలు, అశాంతి. 18, 19, 20, 21 తేదీలలో నూతన ఉన్నత అవకాశములు లభించును. మాసాంతానికి గృహంలోకి నూతన వస్తువుల చేరిక , భూ సంబంధ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు, జీవిత భాగస్వామి వలన సౌఖ్యం వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.