Placeholder image

2020-2021 శ్రీ శార్వరి నామ సంవత్సర మేషరాశి రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Mesha Rasi / Aries Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 05 , రాజపూజ్యం - 03 అవమానం - 01.
  • పూర్వ పద్దతిలో మేషరాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1" . ఇది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో చేపట్టే నూతన వ్యవహారములలో శ్రమ అనంతర విజయాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Mesha Rasi / Aries Sign...

మేషరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. 19 నవంబర్ 2020 వరకూ చక్కటి ఆర్ధిక లాభాలను, వారసత్వ లాభములను, ఉద్యోగ జీవనంలో మంచి ఉన్నతి వంటి అనుకూల ఫలితాలను ఏర్పరచును. 20 నవంబర్ 2020 నుండి వ్యతిరేక ఫలితాలను కలుగచేయును. శుభకార్య సంబంధ వ్యయములను, అపవాదులను, రక్త సంబంధ ఆరోగ్య సమస్యలను ఏర్పరచును.

మేషరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పడును. సులువైన ధనసంపాదన , కుటుంబ సభ్యుల మధ్య చక్కటి అవగాహన, నల్లని వస్త్రములు లేదా వస్తువుల వలన లాభములు, నూనెలు, కందెన సంబంధ వ్యాపారములు చేయు వారికి అతి చక్కటి లాభములు, సంతాన ప్రయత్నాలు చేయువారికి చక్కటి సంతానమును కలుగచేయును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

మేషరాశి వార్కి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. పేర్కొన దగిన తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏమియూ రాహు గ్రహం వలన లేవు.

మేషరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన అనేక సమస్యలు ఏర్పడును. శారీరక సౌఖ్యం తక్కువ అగును. ముఖ్యంగా తండ్రి గారికి లేదా పితృ వర్గీయులకి తీవ్ర ఆరోగ్య క్షీణత బాధించును. వ్యక్తిగత జాతకంలో పితృస్థానంలో దోషములు కలిగిన వారికి పితృ ఖర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడు సూచన. .

మార్చి 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో పితృసంబంధమైన భాగ్యం లభించును. ఎదురుచూస్తున్న మంచి మార్పులు కెరీర్ పరంగా ఏర్పడును. వ్రుత్తి వ్యాపారాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. కుటుంబం ఆర్ధికంగా మెరుగైన స్థితిని పొందును. 11 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య తలపెట్టిన ప్రతీపని శుభఫలితాలను కలుగచేయును. నూతన పదవులు పొందుదురు. సమర్ధవంతంగా పనిచేయగలుగుతారు. చివరి వారంలో కార్యభారం వలన ఆరోగ్యం పాడగును. భాత్రు వర్గం వారికి మీ సలహాలు మంచి చేయును. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం కొంత వరకు తగ్గును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఏర్పడును. విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. వాహనాల వలన ధనవ్యయం అధికంగా ఏర్పడును. ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక చికాకులు బాధించు సూచన. విద్యార్ధులు శ్రమించ వలెను. వ్యాపార వర్గం వారు 14 తేదీ తదుపరి లాభాపడుదురు. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసం కళారంగం లోని వారికి, మీడియా రంగంలో పనిచేయు వారికి చక్కటి ఫలితాలు కలుగచేయును. ఆర్ధికంగా లాభించును. వివాహ ప్రయత్నాలు సులువుగా విజయం పొందును. వైవాహిక జీవనంలో సంతోషకరమైన సంఘటనలు ఏర్పడును. పుణ్యక్షేత్ర సందర్శన సూచనలు కలవు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వారసత్వ సంబంధ సమస్యలు తగ్గుముఖం పట్టును. 12 నుండి 19 వ తేదీ మధ్య కాలం ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు లేదా ఆకస్మిక ఉద్యోగ నష్టం. 20వ తేదీ తదుపరి చేపట్టిన పనులు నిదానంగా పూర్తీ అగును. తీసుకొనే నిర్ణయాలలో ఆవేశ పడకుండా ఉండటం అవసరం. ఈ మాసంలో కాలి నరములకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలోని వారికి సగటు ఆదాయం తగ్గును. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో సంతాన ప్రయత్నాలలో కొంతకాలంగా ఏర్పడుతున్న అడ్డంకులు తొలగును. పుత్ర సంతాన సౌఖ్యమునకు సూచనలు కలవు. నూతన ఆలోచనలు కార్య రూపం దాల్చును. మిత్ర వర్గంతో ఉన్న వివాదములు తొలగును. స్వ శక్తితో గౌరవ ప్రధమైన జీవనాన్ని ఏర్పరచుకొందురు. ఉద్యోగ జీవనంలో అభీష్టాలు సిద్ధించును. నూతన అధికారములు లభించును. వ్యాపార వర్గం వారికి మంచి ప్రోత్సాహకరమైన కాలం. ఈ మాసంలో 12 నుండి 16 వ తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవనమునకు సంబంధించిన ఒక శుభ పరిణామం ఏర్పడును. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు కలసివచ్చును. 24 తేదీ తదుపరి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వలన అశాంతి, ధనవ్యయం. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్ధిక సమస్యలకు, మానసిక అశాంతికి దారితీయు సూచనలు కలవు. ప్రేమ వ్యవహారముల వలన అపకీర్తి, గౌరవ హాని. మేషరాశి పురుషులకు పరభార్యసక్తి వలన తీవ్ర సమస్యలు. ఉద్యోగ జీవనంలో భాద్యతలను చివరి నిమిషంలో పూర్తీ చేయగలుగుతారు. ప్రశంసలు పొందుతారు. పై అధికారుల సూచనలు ఉపయోగపడును. మాసం చివరి వారంలో శుభాకార్యక్రమాలలో పాల్గొందురు. ఈ మాసంలో ప్రధమ వారం మంచి ఫలితాలు ఏర్పడవు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో పితృ వర్గం వారి నుండి ఎదురుచూస్తున్న సహాయం లభించును. నూతన వాహన కోరిక ఫలించును. వ్యాపార వ్యవహారములలో జయం. ధన సమస్యలు తొలగును. యువకులకు విద్యా పరమైన లాభములు ప్రాప్తించును. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభింస్తుంది. ఉపకార వేతనాలు లభిస్తాయి. మాసం ద్వితీయ అర్ధ భాగంలో ప్రయాణాలు ఏర్పడును. తలపెట్టిన ప్రయాణాలు లాభించును. సక్రమంగా ఆలోచించ గలుగుతారు. ఉద్యోగ జీవనంలో సామాన్య యోగం. మాసాంతంలో కుటుంబ పరిస్థితులలో నూతన వ్యక్తుల ప్రవేశ సూచనలు కలవు. ఈ రాశి మహిళలకు వారి పేరుమీద చక్కటి భూ సంపద ఏర్పడు యోగము కలదు. ఈ మాసంలో 4, 7, 10, 19.21 తేదీలు అంత అనుకూలమైనవి కావు. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో ప్రారంభం నుండి 20 వ తేదీ వరకూ ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొనును. ఆశించిన విజయాలు చివరి నిమిషంలో చేజారును. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. 21 వ తేదీ తదుపరి రావలసిన బాకీలు వసూలు అగును. ఆర్ధికంగా కొంత ఒత్తిడి తగ్గును. పని భారం కూడా తగ్గును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందును. అదృష్టం కలసి వచ్చును. గృహనిర్మాణ పనులలో అడ్డంకులు తొలగిపోవును. చిరకాల వాంఛ నెరవేరుతుంది. 28, 29 తేదీలలో అపవాదులు ఎదుర్కొనుటకు సూచనలు కలవు. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొను అవకాశములు అధికం. పారమార్ధిక చింతన అధికమగును. సంతృప్తికర పరిస్థితులు ఏర్పడును. ఉద్యోగ జీవులకు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన సమయం ఏర్పడును. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ఆశిస్తున్న వారికి ఈ మాసంలో ద్వితీయ లేదా తృతీయ వారాలలో వెతలు తీరును. విద్యార్ధులకు చక్కని భవిష్యత్ లభించును. వ్యాపారములు వృద్ధి చెందును. ఆశించిన ధనాదాయం లభించును. కోర్టు కేసులు అనుకూలంగా ముగియును. నూతన మిత్ర వర్గం ఏర్పడును. ఈ మాసంలో 23, 24 తేదీలలో ప్రయనములందు జాగ్రత్తగా ఉండవలెను. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో కళత్ర సంబంధ విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలందు సామాన్య అనుకూలత ఏర్పడును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం తక్కువ అగును. సుఖ వ్యాధుల వలన బాధపడును. జీవిత భాగస్వామితో వివాదాలు అశాంతిని కలుగ చేయును. ఇనుము సంబంధ వ్యాపారాదులలో నష్టం ఏర్పడును. ఇతరులకు ధనాదాయం సామాన్యం. వృధా ధనవ్యయం అధికంగా ఎదుర్కొందురు. ఈ మాసంలో 9, 12, 13, 14, 18, 22, 26, 30 తేదీలు అంత అనుకూలమైనవి కావు. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో సమస్యలు చాలా వరకు తగ్గును. ఆలోచనలు కార్యరూపం దాల్చును. కుటుంబ ఖర్చులు తగ్గించగలుగుతారు. సోదర వర్గం వారితో సమస్యలు కొనసాగును. ఉన్నత అధికారులతో చేసే చర్చలు ఫలించును. ఉద్యోగ సమస్యలకు పరిష్కారములు లభించును. తృతీయ వారంలో సంతాన అనారోగ్యత వలన చికాకులు ఏర్పడును. విదేశీ జీవన ప్రయత్నాలు, ఉద్యోగంలో ప్రమోషన్లకు చేసే ప్రయత్నాలలో విఘ్నాలు ఎదుర్కొందురు. వివాహ ప్రయత్నాలకు కూడా ఇబ్బందులు ఎదురవును. స్త్రీలు మానసిక ఆందోళనకు లోనగు పరిస్థితులు ఏర్పడును. ఈ మాసంలో చేసిన భూమి లేదా గృహ సంబంధ రుణాలు అంత త్వరగా తీరవు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండవలెను. వాయిదా వేసుకోవడం మంచిది. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆశించిన ధనాదాయం లభించును కాని కుటుంబ సభ్యుల వలన జరిగే నమ్మక ద్రోహం, పై అధికారుల వలన ఏర్పడు సమస్యలు, పని ఒత్తిడి , నేత్ర సంబంధ ఆరోగ్య సమస్యలు మానసికంగా దిగులు ఏర్పరచును. చేపట్టిన పనులు అతి నిదానంగా పుర్తిఅగును. ఈ మాసం మీ సహనానికి పరీక్షాకాలం. గర్భవతులు జాగ్రత్తగా ఉండవలెను. చివరి వారంలో బంధు వర్గం వారితో చికాకులు, పెద్ద వయస్సు వారికి జీర్ణ సంబంధ సమస్యలు. విందు - వినోద కార్యములకు దూరంగా ఉండుట మంచిది. పోలిసుల వలన ఇబ్బందులకు అవకాసం ఉన్నది. భరణి నక్షత్ర జాతకులకు ఈ మాసంలో వాహన ప్రమాద సుచన ఉన్నది. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో సమస్యలు తగ్గును. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహం లభించును. ఉన్నత మార్పును ఈ మాసంలో ఆశించవచ్చు. వైవాహిక జీవన సమస్యలు కూడా తగ్గును. విదేశీ జీవనమును కోరుకుంటున్న వారికి శుభ ఫలితాలు. కుటుంబ అనారోగ్యత తగ్గుముఖం పట్టును. చేజారిన వివాహ సంబంధాలు తిరిగి వచ్చుటకు సూచనలు అధికం. ఈ మాసంలో సువర్ణ సంబంధ కొనుగోలు, పెట్టుబడులు లాభించును. 11 వ తేదీ నుండి 22 తేదీలు గత కాలంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించుటకు అనుకూలమైనవి. పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవడానికి , బంధుత్వాలను తిరిగి కలుపుకోవడానికి ఈ మాసం మంచి కాలం. 25, 26, 27, 28 తేదీలలో కాంట్రాక్టు పనులు చేయు వారికి, వడ్డీ వ్యాపారం చేయువారికి మంచి ధన లాభములు ఏర్పడును. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 మేషరాశి ఫలితాలు:

ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చును. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సామాన్య యోగమును కలుగచేయును. ధనాదాయం సామాన్యం. వ్యక్త్రిగత జీవనంలో నూతన వ్యక్తీ వలన తీవ్ర మానసిక ఆందోళన. నిరుద్యోగులకు కూడా ప్రతికూల ఫలితాలు. ఆశించిన ఉద్యోగాలు చేజారిపోవును. నరఘోష వలన ఇబ్బందులు కలవు. మితభాషణం మంచిది. ఈ మాసంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతీ కార్యం స్వయంగా చేసుకోవడం మంచిది. తగాదలలో సర్దుకుపోవడం ఉత్తమం. మాసాంతంలో ప్రమాదాల నుండి తప్పించుకొందురు. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.