Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Meena Rasi / Pisces Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 11, రాజపూజ్యం - 01 అవమానం - 02.
  • పూర్వ పద్దతిలో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మిత్ర సంబంధ సౌఖ్యాన్ని , మధ్యవర్తిత్వ విషయాలలో లాభాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Meena Rasi / Pisces Sign's Nature....

మీనరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరం అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో అన్ని విధములా కలసి వచ్చును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మీనరాశి వారు గురు గ్రహం వలన మంచి ఫలితాలను పొందుదురు. ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్నవారికి గౌరవ ప్రదమైన వృత్తి లభించును. ప్రముఖులతో పరిచయాలు , వారి వలన జీవనమార్గంలో అభివృద్ధి లభించును. సన్మానములు పొందుదురు. దైవ ఉపాసన చేయువారికి శిష్టచారం లభించును. 20 నవంబర్ 2020 నుండి కొంత శారీరక శ్రమ అధికమగును. యోగ భంగం ఏర్పడదు.

మీనరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరం శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. ఈ సంవత్సరం శని వలన మీనరాశి వారు చక్కటి అనుకూల ఫలితాలు పొందుదురు. ఆర్ధిక విషయాలలో లోభాత్వం ప్రదర్శించుట వలన కుటుంబ సభ్యులను దూరం చేసుకొందురు. దానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు. వ్యక్తిగత జాతకంలో శని ఉచ్చ స్థితిలో ఉన్నవారు ఈ సంవత్సరం అంతా రాజయోగం అనుభవించును. సులువైన ధన సంపాదన ఏర్పడును.

మీనరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురి వలన కూడా అనుకూల ఫలితాలు లభించును. చక్కటి మాతృ సంబంధ అభివృద్ధి, విద్యా సంబంధ లాభములు, వాహన సంబంధ సౌఖ్యం ఏర్పడును. 25 సెప్టెంబర్ 2020 తదుపరి ఉద్యోగ వ్యాపారాలలో విశేష యోగం, సంపూర్ణ ఆయుర్భాగ్యములు , సకల దేవతా కటాక్షం, ఉత్తమ సంతాన సౌభాగ్య ఫలాలు పొందుదురు. రాహు-కేతువులు మీనా రాశి వారికి అన్ని విధములా శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మంచి చేయును. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగిన వారు, నీచ స్థానములలో రాహు- కేతువులను కలిగి ఉన్నవారు మాత్రం అదృష్ట హీణతను, పైన పేర్కొనిన ఫలితాలకు వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొందురు.

మార్చి 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో తలపెట్టిన ప్రతీ కార్యం, ఆలోచన లాభించును. గతకాలపు సమస్యలు తొలగును. కార్య సిద్ధి, ఆర్ధిక అభివృద్ధి ఏర్పడును. వృధా ధనవ్యయం తగ్గును. చేతిపై ధనం నిలుచును. శారీరక స్వస్థత ఏర్పడును. గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్థి లాభం ఏర్పడును. వివాదాలు తొలగిపోవును. అరుదైన అవకాశములు లభించును. శుభవార్తలు వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరచును. 24 వ తేదీ నుండి 29 వ తేదీ మధ్య కాలంలో మీనరాశి కి చెందిన స్త్రీలకు గర్భ లేదా ఉదర సంబంధ సమస్యలున్నాయి. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రధమ వారంలో మిత్రులతోనూ , అధికారులతోనూ విభేదములు ఏర్పడును. ద్వితియ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం కొంత తగ్గును. తృతీయ వారంలో సంతానం వలన సౌఖ్యత ఏర్పడును. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి. క్రీడా రంగంలోని వారికి చక్కటి విజయములు లభించును. 20 వ తేదీ తదుపరి ఆర్ధిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమగు సూచనలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో జీవనంలో గౌరవ హోదాలు పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించును. ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు. కుటుంబ సంతోషములు ఉన్నాయి. ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు. అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ద్వితీయ వారం తదుపరి నూతన వ్యాపారములు ప్రారంభించుటకు అనుకూలత లభించును. మాసాంతంలో సంతాన భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం బాగుండును. పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభములు ఏర్పడును. వృత్తి వ్యాపారములు సామాన్యం. జీవిత భాగస్వామి మూలక ధన లాభములు. మాసం మొత్తం మీద ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా గత మాసపు అనుకూల ఫలితాలు కొనసాగును. ధనాదాయం సామాన్యం. ద్వితీయ వారంలో కుటుంబంలోని పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగములు. 4,7,13,17,22 తేదీలలో వృత్తి వ్యాపారాలలో చక్కటి ధన ఆదాయం. నూతన ప్రయత్నములలో సులువుగా విజయం చేకూరును. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం వ్యక్త్రిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడును. ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతితో బాధపడుదురు. కుటుంబంలో అనవసరమైన కలహములు ఏర్పడి అపకీర్తి పొందుతారు. తృతీయ వారం వరకూ కార్య విఘ్నములు ఏర్పడుచుండును. 18, 19 తేదీలలో ప్రయాణములలో ప్రమాద సూచన. జాగ్రత్త అవసరం. ఈ మాసంలో కాలం అంతగా కలసి రాదు. ధనాదాయం సామాన్యం. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో పోటీ, పెరిగి ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. తల్లితో లేదా మాతృ వర్గీయులతో విభేదాలు భాదించును. ఉద్యోగ జీవనంలో 22,23,24,25 తేదీలలో ఉన్నత అధికారుల వలన ఇబ్బందులు. కెరీర్ కు సంబందించిన ఆందోళన అధికం అగును. ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుట మంచిది కాదు. వైద్య రంగంలో ధనార్జన చేయు వారు 22 నుండి 26 వ తేదీల మధ్య కాలంలో జాగ్రత్తగా ఉండవలెను. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అనుకూలమైన కాలం. ప్రతీ కార్యం దైవ ఆశీస్సులతో విజయం పొందును. కుటుంబ కలహాలు తొలగి బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టములు నుండి బయటపడుడురు. ఆశించిన విధంగా ధన ప్రాప్తి పొందుతారు. అనారోగ్య సమస్యలనుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగముల వారికి ఈ మాసం అనుకూల ఫలితాలను కలుగచేస్తుంది. మీ చేతి మీద పుణ్యకార్యములు నిర్వహిస్తారు. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో గత కాలంలో నిలిచిపోయిన పనులు, కార్యములను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన సంబందిత విషయాలలో మాత్రం చికాకులు ఏర్పడును. సంతానం కొరకు అధికంగా ధనం ఖర్చుపెట్టవలసి వచ్చును. స్నేహితుల పనులు కోసం వృధాగా శ్రమించవలెను. గృహ సంతోషములు మధ్యమం. ఈ నెలలో 22 నుండి 29 తేదీల మధ్య ఆర్ధిక సంబంధ కార్యక్రమాలలో జాగ్రత్త వహించవలెను. చివరి వారంలో వ్యాపార రంగంలోని వారికి ఆకస్మికంగా ధనాదాయం స్థంభించును. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రధమ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. 5,6 తేదీలు విదేశీ సంబంధ ప్రయత్న వ్యవహారాలకు అనుకూలమైనవి. ద్వితియ వారంలో ఆర్ధిక ఋణములు తీరును. నూతన పరిచయాలు ఏర్పడును. తృతీయ వారం నుండి సామాన్య ఫలితాలు. 25 వ తేదీ తదుపరి గృహంలో శుభకార్య సంబంధ ఉత్సాయపూరిత వాతావరణం. మాసం మొత్తం మీద ధనాదాయం బాగుండును. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సంతాన సంబంధ ప్రయత్నాలలో చక్కటి లాభములు. ఆశించిన విధంగా సంతాన ప్రాప్తి ఏర్పడును. ధనాదాయం సామాన్యం. 12వ తేదీ తదుపరి ఉద్యోగ ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలూ లభించును. ద్వితియ వారం తదుపరి నూతన గృహ ప్రయత్నములు ఫలించును. వ్యక్తిగత జీవనంలో ఆందోళనతో కూడిన ఆలోచనలు అధికమగును. ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చును. ఈ నెలలో ప్రారంభించు నూతన వ్యాపారములు విజయవంతం అగును. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో విద్యార్ధులకు అఖండ విజయం ఏర్పడును. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి నిపుణులకు సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. ద్వితియ మరియు తృతీయ వారములు సామాన్య ఫలితాలు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. ఈ మాసంలో 19, 20, 25, 26, 27 తేదీలు అంత అనుకూలమైనవి కావు. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 మీనరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అవివాహితుల వివాహ ప్రయత్నములు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుంటుంది. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక. స్థానచలనముకు అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో శాంతి. వ్యాపారములు విస్తరించే అవకాశం. మాసాంతంలో ఉద్యోగ ప్రయత్నములు లాభించును. 26, 28,30 తేదీలు మంచి ఫలితాలను కలిగించును. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.