Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Makara Rasi / Capricorn Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 05, రాజపూజ్యం - 02 అవమానం - 06.
  • పూర్వ పద్దతిలో మకర రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శ్రమానంతర విజయాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Marara Rasi / Capricorn Sign's Nature....

మకరరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరం అంతా అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. మకర రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన అంత మంచి ఫలితాలు ఏర్పడవు. సంవత్సరం అంతా శుభ కార్య సంబంధ ఖర్చు విశేషంగా ఉండును. ఆర్ధిక లక్ష్యాలను చేరుకోలేరు. పితృ వర్గీయుల వలన ఆశించిన సహకారములు పొందలేరు. శత్రు వృద్ధి అధికంగా ఉండును.

మకరరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావ ఫలితంగా మానసిక ఆందోళన అధికమగును. వృత్తి జీవనము మరియు వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం తక్కువ అగును. ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు లభించదు. చేస్తున్న పనులలో సంతృప్తి ఉండదు. వ్యక్తిగత జాతకంలో శని బలహీణ లేదా శత్రు లేదా నీచ స్థానాలలో ఉన్న జాతకులు తమ ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు ప్రయత్నించకుండా ఉండుట మంచిది. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలెను.

మకరరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు - కేతువులు మంచి ఫలితాలు కలుగచేయును. వ్యక్తిగత జాతకంలో సర్ప దోషం కలిగన వారు సంతాన సంబంధంగా నష్టములను లేదా సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులను ఎదుర్కొందురు. మకర రాశి వారికి రాహు - కేతువులు ఇరువురూ సంవత్సరం అంతా కొంత వరకు ఆర్ధికంగా మంచి చేయును. మిక్కిలి పారమార్ధిక చింతణ ఏర్పరచును. తీర్ధయాత్రా పుణ్య ఫలితమును కలుగచేయును.

మార్చి 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ జీవనంలో మానసిక ఒత్తిడి అధికమగు సూచనలు కలవు. ప్రతీ విషయంలోనూ సందేహాలు ఎదురగు అవకాశం కలదు. వ్యాపార రంగంలోని వారికి అధికారుల వలన సమస్యలు. వ్యక్తిగత జీవనం మాత్రం బాగుంటుంది. జీవిత భాగస్వామి మీ అవసరాలను గమనించి తగువిధంగా నడుచుకొందురు. సంతానం కోసం ప్రయత్నాలు చేయువారికి శుభవార్తలు. గృహ నిర్మాణ సంబంధ బ్యాంకు రుణాలు లభిస్తాయి. సొంత గృహం కల నెరవేరుతుంది. ఈ మాసంలో 13 వ తేదీ నుండి 20 వ తేదీ మధ్య చేయు ప్రయాణములందు జాగ్రత్త అవసరం. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో పితృ వర్గానికి చెందిన ఆత్మీయులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినడానికి సూచనలు ఉన్నాయి. ధన ఆదాయం అవసరాలకు తగిన విధంగా ఉండును. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఆశించిన ఫలితాలు ఏర్పడును. కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగును. సమాజంలో నూతన హోదా ను ఏర్పాటుచేయుదురు. జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాలలో తోడ్పాటు లభించును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా కొనసాగును. చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత లభించును. ఈ మాసంలో 24, 25, 26 తేదీలలో యుక్త వయస్కులైన పుత్ర సంతానానికి ఆరోగ్య సమస్యలు. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వివాహ జీవనంలో ఎదుర్కొంటున్న గత కాలపు సమస్యలు తగ్గును. వ్యక్తిగత జీవన పరిస్థితులు కూడా మెరుగుపడును. కోర్టు తగాదలలో అనుకూలత ఏర్పడును. గృహంలో బంధు వర్గం కలయికల వలన సంబంధాలు మెరుగుపడును. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్ధికంగా వ్యయం ఎక్కువ అగుటకు సూచనలు ఉన్నాయి. 22 వ తేదీ తదుపరి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సంతోషకర వార్తలు వింటారు. వ్యాపార వర్గం వారికి ఆదాయంలో పెరుగుదల ఏర్పడును. సంతాన ప్రయత్నాలు సఫలమగుటకు దైవ ఆశీస్సులు అవసరం. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గములు లభించును. వ్యాపారములు మంచి అభివృద్ధికర మార్గంలో కొనసాగును. భాత్రు వర్గంతో ఆధిపత్య సంబంధ విరోధములు ఏర్పడును. ద్వితీయ వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. తృతీయ వారంలో మిత్రుల వలన ఒక ఆర్ధిక నష్టం ఎదుర్కొందురు. కుటుంబ పరంగా సిద్ధంగా లేని ఖర్చులు ఎదుర్కొందురు. వివాహ ప్రయత్నములలో ఆశాభంగం ఏర్పడును. ఈ మాసంలో బ్యాంకు లేదా బంగారు ఆధారిత ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో పాల్గొనుట అంత మంచిది కాదు. కుటుంబ పెద్దల సలహా పాటించండి. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రధమ అర్ధభాగం అంత అనుకూలంగా ఉండదు. మకర రాశికి చెందిన స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలుగచేయును. ధనాదాయం తగ్గును. అవసరాలకు రావలసిన ధనం అందుట కష్టం. హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోరు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ద్వితీయ అర్ధ భాగం నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభమగును. నూతన కాంట్రాక్టులు పొందుతారు. సంతాన ప్రయత్నములు వంశ పెద్దల ఆశీస్శులతో విజయవంతం అవుతాయి. ఆర్ధిక విషయాలలో కూడా అనుకూలత పొందుతారు. చివరి వారం స్థానచలన ప్రయత్నాలకు మంచి కాలం. ఈ మాసంలో దంత సంబంధ సమస్యల వలన ఇబ్బడి పడుదురు. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ప్రారంభంలో చికాకులు ఉన్నప్పటికీ చివరకు జయం చేకురును. వ్యక్త్రిగత జీవనంలో సంతోషకర సంఘటనలు ఏర్పడును. శత్రువులపై విజయం పొందుతారు. కొద్దిపాటి గర్వం ప్రదర్శిస్తారు. తలపెట్టిన పనులలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ద్వితియ తృతీయ వారములలో అనేక ఆటంకములతో విదేశీ ఉద్యోగ ప్రయత్నములు సఫలం అగును. కుటుంబ వ్యవహారములలో మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. మీ మాటతీరు సమస్యలను ఏర్పరచును. చివరి వారంలో శ్రమ అధికం మరియు ఉద్యోగ జీవనంలో అనిశ్చిత వాతావరణం. ఈ మాసంలో 10, 11, 18, 25, 26 తేదీలలో చేయు ప్రయాణాలు కలసిరావు. నూతన కార్యాకలాపాలు ప్రారంభించకండి. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో బహు అవరోధములు ఎదుర్కొందురు. మానసిక వ్యధ కూడా అధికం అగును. భవిష్యత్ ఆందోళన అధికం అగును. అకాల భోజనములు చికాకులు కలుగ చేయును. పిల్లలకు శిరోబాధ లేదా కర్ణ సంబంధ సమస్యలు. వివాహ ప్రయత్నాలు కష్టం మీద జయం పొందును. ఉద్యోగ జీవనంలో ఉహించని ఆటంకములు ఏర్పడును. దురుకోపాన్ని తగ్గించుకోవాలి. సోదరి వర్గ సంబంధ పనులకోసం విరామం లేకుండా శ్రమించవలసి వచ్చును. నూతన విద్యలను అభ్యసించు అవకాశములు లభిస్తాయి. ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోని ప్రవర్తించుట మంచిది. వృత్తి వ్యపారములందు మొత్తం మాసం మీద ధనాదాయం కొంత తగ్గును. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వృద్ధులకు శరీర ఆరోగ్యం సహకరించును. కుటుంబ జీవనంలో శుభకార్యములు నిర్వహించుట, ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో చేరికలు ఏర్పడుట జరుగును. ఉద్యోగ జీవనంలో కార్యానుకులాత లభించును. స్నేహితుల వాహనం వలన ఇబ్బందులు ఎదురగును. జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యలు తొలగును. చివరి వారంలో వృత్తి వ్యాపారములు సులువుగా ఆశించిన విధంగా కొనసాగును. మాసాంతంలో సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులకు నిల్వధనం ఏర్పడును. చక్కటి ఉద్యోగ స్థిరత్వం లభించును. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో చాలా అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. సజ్జన సాంగత్యం లభించును. పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధన లాభములు ఏర్పడును. బ్యాంకు ఋణ బాధలు తొలగుతాయి. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన అనుకూల బాటలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది. 17 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడును. దూర దేశ ప్రయాణాలు చేస్తారు. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామి పనులకై సమయం వెచ్చిస్తారు. మీ సహకారం వలన వారికి కార్యజయం ఏర్పడుతుంది. వ్యక్తిగత జీవనంలో సౌక్యం ఏర్పడును. ఆర్ధిక విషయాలలో మిత్ర వర్గంపై ఆధారపడకుండా ఉండుట మంచిది. కుటుంబంలో ఎదుర్కొంటున్న వృధా వ్యయం తగ్గించగలుగుతారు. ద్వితియ వారంలో వాహనముల వలన ఇబ్బందులు కలుగును. పరోపకారం వలన ఆత్మతృప్తి లభించును. విదేశీ లేదా ఉద్యోగ స్థానచలన ప్రయత్నములలో కష్టం మీద విజయం చేకురును. 7,8,9,10 తేదీలలో నూతన ప్రయత్నాలు చేయుట మంచిది. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో 2వ తేదీ నుండి 7వ తేదీ వరకూ కాలం అనుకూలంగా ఉండదు. గృహంలో చొరభయం లేదా విలువైన వస్తువులు చెడిపోవును. మానసికంగా ఆందోళన చెందుతారు. ద్వితియ వారంలో కార్యభారం పెరుగును. తీవ్ర కాలయాపనతో దూరప్రాంత ప్రయాణములు ఏర్పడతాయి. మిక్కిలి ప్రయాస అనంతరం కార్యములలో విజయం సాధిస్తారు. వృత్తి - వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములకై చేయు ఆలోచనలు ఫలిస్తాయి. పుత్రికా సంతానం వలన కొద్దిపాటి చికాకులు. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు లేవు. వ్యక్తిగత ఆరోగ్యంలో జ్వరతత్వం వలన బాధలు ఏర్పడును. కష్టంతో పనులు పుర్తిచేయగలుగుతారు. గత కాలంలో దాచుకున్న ధనము కొంత వ్యయం అగును. 16వ తేదీ నుండి నుండి ఆందోళనకర పరిస్థితలు అధికం అగును. ప్రభుత్వ అధికారుల వలన తీవ్ర ఆటంకములు. చివరి వారానికి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండగలదు. ప్రతీ వ్యవహారంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధ ప్రయత్నాలలో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడును. ఈ మాసంలో 7,9,11,25 తేదీలు అనుకూలమైనవి కావు. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 మకరరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగును. ధనాదాయం ఆశించినంతగా ఉండదు. భూ సంబంధ క్రయవిక్రయాల వలన నష్టం ఏర్పడును. వ్యాపార వ్రుత్తిజీవనంలోని వారికి ఆదాయంలో తగ్గుదల ఎదురగును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన భాద్యతల వలన విశ్రాంతి వుండదు. పూర్తిగా శ్రమించినా కూడా విమర్శలు ఎదుర్కొందురు. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.