Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 05, రాజపూజ్యం - 05 అవమానం - 02.
  • పూర్వ పద్దతిలో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో విజయాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Kumbha Rasi / Aquarius Sign's Nature...

కుంభరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరం అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావమున్నది. కుంభ రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో గురు గ్రహం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. 19 నవంబర్ 2020 వరకూ విశేషమైన న్యాయార్జితమును , ఉన్నత హోదాను , అధికారమును ఏర్పరచును. మనోవాంచ్చా ఫలసిద్ధిని కలుగచేయును. స్థిరాస్తి సంబంధ లాభమును ఏర్పరచును. 20 నవంబర్ 2020 నుండి గురువు యోగించడు. వ్యవహార చిక్కులను, కుటుంబ విషయాలలో విచారమును, ధన వ్యయములో పెరుగుదలను కలుగచేయును. వ్యక్త్రిగత జాతకంలో అష్టమ స్థానంలో నీచ గురువు ఉన్నచో ఆయుర్ధాయ భంగము కూడా ఏర్పడు అవకాశం కలదు.

కుంభరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ ప్రభావం వలన అనుకూల ఫలితాలు లభించవు. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని కుంభ రాశి వారికి వృధా ప్రయాణాలు, ప్రయాణ మూలక ఆరోగ్య మరియు ధన హాని, అతివ్యయం, పై అధికారుల వలన అవమానకర సంఘటనలు, కుటుంబములో ప్రాణ నష్టం, వితంతు సోదరి వలన సమస్యలు, విష ఆహరం వలన ఇబ్బందులు వంటి చెడు ఫలితాలను కలుగచేయును.

కుంభరాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ మంచి ఫలితాలు ఇచ్చును. ముఖ్యంగా కేతు గ్రహం వలన 25 సెప్టెంబర్ 2020 తదుపరి విద్యార్ధులకు మిక్కిలి విజయములు ఏర్పడును. విద్యా సంబంధ సౌఖ్యము, పేరు ప్రతిష్టలు లభించును. ఆర్ధికంగా వైద్య రంగంలో ఉన్న వారికి , యంత్ర సంబంధ వ్యాపారములు చేయువారికి మిక్కిలి ధనార్జన ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి నిరాశాపూరిత కాలమును ఏర్పరచును.

మార్చి 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఎదిగిన సంతానమ వలన సమాజంలో గౌరవ హాని. పంతాలకు పోవుట వలన ఇబ్బందులు. గత మాసపు సమస్యలు కొనసాగును. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో పరిస్థితులు క్రమంగా మెరుగవును. ధనాదాయం క్రమంగా పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో ప్రోత్సాహం లభించును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు ఏర్పడును. పై అధికారుల వలన లాభం ఉంటుంది. స్త్రీలకు కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలుగ చేయును. ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు మంచి సమయం. కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు ఏర్పడతాయి మరియు లాభకరంగా పూర్తి అగును. చివరి వారంలో వివాహ సంబంధ అనుకూలత ఉన్నది. గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వర్తిస్తారు. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్య సమస్యల వలన ఒత్తిడి ఎదుర్కుంటారు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. అవసరములకు రావలసిన ధనం చేతికి వచ్చును. 12 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య కాలంలో ప్రయనాలందు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వాహన ప్రమాద సూచన ఉన్నది. తృతీయ వారం సామాన్య ఫలితాలను కలుగ చేయును. చివరి వారంలో అధిక ధన వ్యయం మరియు సొంత ఆరోగ్య విషయాలలో చికాకులను కలుగచేయును. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశాభంగములు ఎదుర్కొంటారు. చివరి నిమిషంలో అవకాశములు కోల్పోతారు. 24, 25, 26 తేదీలలో ఉద్రేక సంభాషణల వలన ఒక నష్టం ఎదుర్కొందురు. ఉపయోగించు పదాల పట్ల జాగ్రత్త అవసరం. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వ్యక్తిగత జీవితంలో శుభకరమైన ఫలితాలు ఏర్పడును. నూతన వ్యాపార ప్రారంభకులకు కార్య సిద్ధి లభిస్తుంది. స్త్రీలు ఆశ్చర్యకరమైన బహుమతులు పొందుతారు.ప్రధమ, ద్వితీయ వారములలో తలపెట్టిన ప్రయాణాలు సౌఖర్య్యవంతంగా పుర్తిఅగును. తృతీయ వారంలో అఖస్మిక శారీరక రుగ్మతలు చికాకులను కలుగచేయును. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి ఏర్పడును. వారి నుండి కృతజ్ఞతను ఆశించ వద్దు. చివరి వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. మొత్తం మీద ఈ మాసంలో ధనానికి లోటు ఏర్పడదు. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో శరీర ఆరోగ్యం సహకరించును. సంతానం వలన మానసిక ఉల్లాసం లభించును. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో బంధు మిత్రుల కలయిక ఏర్పడును.పితృ వర్గీయుల కొరకు ధన వ్యయం ఏర్పడుతుంది. ఉద్యోగ సంబంధ స్థాన చలన ప్రయత్నములకు ద్వితీయ , తృతీయ వారములు అనుకూలంగా ఉండును. తలపెట్టిన పనులలో ఏర్పడుతున్న ఆటంకములు తొలగును. అధికారులతో వివాదాలు తొలగును. ధనాదాయం బాగుండును. సినీరంగ వ్యాపారములు చేయు వారికి మాత్రం ఆశించిన లాభములు లభించుట కష్టం. పెట్టుబడులు పెట్టుటకు ముందు పెద్దల సలహాలు పాటించుట మంచిది. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం కూడా అనుకూలమైన ఫలితాలు కలుగచేయు మాసం. చిరకాలంగా ఉన్న నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. ఆశించిన విధంగా ధనదయం లభిస్తుంది. గత కాలపు పెట్టుబడుల నుండి ధనం చేతికి లభించును. గృహ సంబంధ క్రయవిక్రయాలందు మధ్యవర్తిత్వం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఈ మాసంలో ఆలోచనలు సక్రమంగా ఉండును. కార్య భారం తగ్గుతుంది. తోటి ఉద్యోగుల నుండి చక్కటి సహకారం పొందుతారు. తృతీయ వారంలో మాతృ వర్గీయులతో ఆర్ధిక సంబంధ విషయాలందు విభేదాలు ఏర్పడును. నూతన విషయాల పట్ల ఆసక్తి పెరుగును. వ్యక్తిగత జీవనం ఆనందకరంగా కొనసాగుతుంది. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కుటుంబ పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ఆర్ధికంగా వివాదాలను కలుగచేయును. తోదరపడి భాగస్వామ్య వ్యాపారములందు పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. ద్వితీయ వారం లోపున వాయిదా పడుతూ వస్తున్న ఇష్ట దైవ సందర్శన ఏర్పడును. పారమార్ధిక చింతన అలవరచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారములు మినహా మిగిలిన రంగాల వారికి ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులకు రుణ విషయములందు వ్యక్త్రిగత హామీలు ఇవ్వకండి. ఈ మాసంలో చేయు వివాహ , సంతాన ప్రయత్నములు లాభించును. పుత్ర సంతానమునకు ఈ మాసం అనుకూలమైన కాలం. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంఘర్షణ సంబంధిత చికాకులు మాత్రం కొనసాగును. సొంత మనుష్యుల నిరాదరణ మానసికంగా బాధించును. ఈ మాసంలో దూర ప్రాంత , పరదేశ స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. ద్వితీయ వారంలో శరీరమునకు కార్య భారం వలన అలసట ఏర్పడును. ఉద్యోగ జీవనలో ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆలోచనలు ముందుకు సాగవు. నూతన వ్యాపారాలు అంతగా రాణించవు. చివరి వారంలో మిత్రులే శత్రువులగుదురు. మీకు అపఖ్యాతిని ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. వ్యక్త్రిగత విషయాలు అన్నింటిని మిత్రులతో ప్రస్తావించట మంచిది కాదు. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. ఉహించని విధంగా వ్యాపార వ్యవహారములందు ఆదాయం తగ్గును. భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసుకున్న నిల్వ ధనం కూడా అవసరాలకు ఉపయోగించవలసి వచ్చను. వైవాహిక జీవితంలో ఆశించిన సంతోషాలు లభించవు. పెట్టుబడులు, శారీరక శ్రమ వృధా అగును. మానసికంగా ఒంటరితనం బాధించును. 13 వ తేదీ తదుపరి తలపెట్టిన ఏ ప్రయత్నం అనుకూలించక నిరాశ ఆవహించును. ఈ మాసంలో 13, 16, 17, 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ అర్ధ భాగంలో ఉద్యోగ జీవన నష్టం, కార్య విఘ్నతలు, చిన్న పిల్లలకు శారీరక హాని, వృత్తి - వ్యాపార రంగం వార్కి ఆదాయంలో తగ్గుదల, వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి వంటి అననుకూల ఫలితాలు ఏర్పడతాయి. 17 వ తేదీ తదుపరి అనవసర ఖర్చులు తగ్గుతాయి. నూతన అవకాశములు లభిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన కుటుంబ సంబంధాలు ఏర్పడుతాయి. ఈ మాసంలో 4, 7 9, 12 , తేదీలు అనుకూలమైనవి కావు. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం బాగుంటుంది. ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం లభించును. ప్రభుత్వ అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తొలగును. నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నములు చేయుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతిని ఆశించవచ్చు. ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తారు. శ్రమ వలన పేరు ప్రఖ్యాతలు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం ప్రారంభ రోజులలో ద్రవ్య లాభం పొందుతారు. బంధు వర్గం వలన సహకారం పొంది నూతన స్తిరాస్తులను ఏర్పాటు చేసుకొంటారు. వృత్తి జీవనంలోని వారికి గౌరవం, చక్కటి అభివృధ్హి ఏర్పడును. విదేశీ జీవనం చేయువార్కి ఈ మాసం కలసిరాదు. సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించుదురు. సంతానంతో విరోధములు ఏర్పడును. శతభిషా నక్షత్ర స్త్రీలకు అపవాదులు భాదించును. మనశ్శాంతి లోపించును. మాసాంతమునకు ప్రతీ వ్యవహారం శ్రమకరంగా ఉండును. ముఖ్యంగా 26, 27, 28 తేదీలు మంచివి కావు. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 కుంభరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో గృహంలోనూ , వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనంలో అనుకూలమైన పరిస్థితిలు ఏర్పడతాయి. చక్కటి లాభకరమైన వాతావరణం మరియు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. నూతన వాహన సంబంధ ప్రయత్నాలు లాభించును. కాలయాపన చేస్తూ , వాయిదా వేస్తూ వస్తున్న పనుల వలన మరింత ఇబ్బందులు ఎదుర్కొందురు. 16 నుండి 21 వ తేదీ మధ్య విష ఆహార సంబంధ అనారోగ్యం భాదించు సూచన. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.