Placeholder image

2020-2021 శ్రీ శార్వరి నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 11 వ్యయం - 08 రాజపూజ్యం - 05 అవమానం - 04.
  • పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో భూసంబంధమైన లేదా గృహ సంభంధమైన లాభాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Cancer sign / Karkataka Rasi Nature....

కర్కాటక రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం అనుకూల ఫలితాలు ఇవ్వదు. రక్త సంబంధ, హృదయ సంబంధ, మెదడు లేదా నరముల సంబంధ సమస్యలు ఏర్పరచును. స్థూలకాయత వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. పుత్ర సంతానం సంబంధిత విషయాలలో సమస్యలు ఎదుర్కొందురు. కర్కాటక రాశి వారు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో గొప్పలకు పోయి నష్టపోదురు. విద్యార్ధులు సోమరితనం ప్రదర్శించుదురు. ముఖ్యంగా 20 నవంబర్ 2020 నుండి పిత్రువర్గీయులకు ఆరోగ్య పరంగా అంత మంచిది కాదు. వారసత్వ సంబంధ కోర్టు కేసులు కలిగిన వారు నష్టపోదురు. శ్రీ శార్వరి నామ సంవత్సరం అనవసర తగాదాలను, శత్రుత్వములను, మానసిక చికాకులను కలుగ చేయును.

కర్కాటక రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని వలన కెరీర్ పరంగా స్వల్ప యోగం కలుగును. వివాహ ప్రయత్నాలు చేయు వారికి అతి కష్టం మీద సంబంధములు కుదురును. జాతకంలో శని వలన కళత్ర దోషం కలిగిన వారు వివాహ నష్టము ఎదుర్కొందురు. విడాకుల కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ సంవత్సరం విడాకులు మంజూరు అగును. కర్కాటక రాశి వారందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని వలన కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏలినాటి శని లేదు.

కర్కాటక రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 24 సెప్టెంబర్ 2020 వరకూ ఇబ్బందులు ఏర్పడును. ముఖ్యంగా చెడు స్నేహాల వలన, ప్రేమ కలాపాల వలన, వ్యసనాల వలన వృధా ధన వ్యయం ఏర్పడును. వ్యక్తిగత జాతకంలో రాహు దోషం కలిగిన వారు పోలీస్ కేసుల వలన ఇబ్బందులను, కారాగ్రుహ ప్రాప్తిని ఎదోర్కొందురు.

25 సెప్టెంబర్ 2020 నుండి రాహువు అన్ని విధములా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. ముఖ్యంగా ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లను , నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని, దూర దేశ ఉద్యోగ ప్రయత్నాలలో సఫలతను ఏర్పరచును. ఆర్ధికంగా కూడా మంచి ఆదాయమును ఇచ్చును. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన అధికారములను ప్రాప్తింపచేయును.

కర్కాటక రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కేతు గ్రహం ఒక్క సంతాన సంబంధ విషయాలలో మినహా మిగిలిన అన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలుగ చేయును. సంతాన ప్రయత్నాలు చేయువారికి మాత్రం ఇబ్బందులు కలుగచేయును.

మార్చి 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ధనాదాయం బాగుండును. మానసిక ప్రశాంతత కోరవడును. మనోధైర్యాన్ని కోల్పోవు సంఘటనలు ఏర్పడు సూచన. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం ఏర్పడును. అప్రయత్నంగా కొన్ని సమస్యలను కొని తెచ్చుకొందురు. శారీరక శ్రమ పెరుగును. ఈ మాసంలో అతి ధైర్యంతో ఆలోచనలు చేయకుండా ఉండుట మంచిది. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం పెరుగునట్టు వ్యవహరించుట అవసరమగును. శైవ సంబంధ పుణ్యక్షేత్ర సందర్శన చేయుట మంచిది. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధన సంబంధ విషయాలు ప్రతికూలం. ఉద్యోగ జీవనములో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడు సూచన. ఆరోగ్య పరంగా ముత్ర సంబంధ సమస్యలు, శిరోబాధ బాధించు సూచన. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం తగ్గును. చేపట్టిన పనులు , నూతన ఆరంభములు ప్రతిఘటనలతో కొనసాగును. ఇతరుల సహాయ సహకారాలకోసం కష్టపడుదురు. ఈ మాసంలో సహనంతో వ్యవహరించుట అన్ని విధాల మంచిది. ఈ మాసంలో 16, 20, 23, 29 తేదీలలో ఆర్ధిక - ఆరోగ్య విషయాలందు జాగ్రత్తగా ఉండుట మంచిది. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గును. నూతన వ్యవహారాలు, వివాహ సంబంధ ప్రయత్నాలు మాత్రం సమస్యలు కలిగించును. జీవిత భాగస్వామి బంధువులతో శతృత్వం. వ్యక్త్రిగత జీవనంలో కొద్దిపాటి సమస్యలు. కుటుంబ బంధాలపై నమ్మకం దెబ్బతినును. చేపట్టిన పనులను మధ్యలోనే వడిచిపెట్టుదురు. వ్యతిరేక ఫలితాల వలన ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. కుల వృత్తులపై ఆధార పడిన వారికి తీవ్ర సమస్యలు. ఋణ బాధలు. తృతియ , చతుర్ధ వారములలో సంతన సంబంధ శుభ వార్త. మొత్తం మీద ఈ మాసం ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆర్ధిక విషయాలు కొంత బాగుంటాయి. వ్యాపారములలో ఆదాయం గత మాసాల కన్నా పెరుగుతుంది. కొద్దిపాటి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు చేయు స్థాన చలన ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆశించిన ధనాదాయం లభించును. వృధా వ్యయం కూడా తగ్గుతుంది. ఉద్యోగ జీవనం వారికి ప్రధమ, ద్వితీయ వారాలలో కొన్ని పొరపాట్లు చేయుట వలన ఇబ్బందులు ఉన్నాయి. ఏకాగ్రతతో పనిచేయాలి. కుటుంబ బంధాలపై ఆలోచన అవసరం. రక్త సంబంధాల విలువ అర్ధం చేసుకోవాలి. ఈ మాసంలో 16 నుండి 19 వ తేదీల మధ్య కాలం కుటుంబ విషయాలకై చర్చించుటకు మంచి రోజులు. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో దూర ప్రాంత ఆదాయ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఆదాయం పొందగలరు. నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. ఉద్యోగ జీవనంలో నిలకడ వస్తుంది. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగును. కుటుంబ విషయాలలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలలో పట్టు సాధిస్తారు. పరిస్థితులు అవగాహన అవుతాయి. సంతాన ప్రయత్నాలు విజయవంతం అగును. ముఖ్యమైన నిర్ణయాలను ఈ మాసంలో తీసుకొనవచ్చు. మొత్తం మీద ఈ మాసంలో తీవ్ర ఇబ్బందుల నుండి బయటపడతారు. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఏర్పరుస్తుంది. పట్టుదలకు పోయి వ్యవహారాలను పాడు చేసుకొంటారు. మిత్రుల మాట అతిగా విని నష్టపోతారు. దురలవాట్ల వలన ప్రమాదాలు ఎదుర్కొంటారు. ఎదో ఒక విధంగా అవసరాలకు తగిన ధనం మాత్రం సర్దుబాటు అవుతుంది. నూతన వ్యవహారాలు ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కుటుంబంలో ఒక తీవ్ర నష్టం ఏర్పడుటకు సూచన ఉన్నది. ఈ మాసంలో ప్రయాణ మూలక ఆరోగ్య సమస్యలు మరియు ఆశభంగములు ఏర్పడును. భాగస్వామ్య వ్యవహారాలలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుంటారు. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. చివరి వారానికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. సంతాన ప్రయత్నాలు చేయువారు అశుభ వార్త తెలుసుకొను సూచనలు ఉన్నవి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యవహారాలలో నూతన సమస్యలు ఏర్పడును. ఒత్తిడి అధికమగును. నిద్రలేమితనం బాధిస్తుంది. ఆశించిన సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఈ మాసంలో మిత్రులతో సంభాషించునపుడు ఆచి తూచి మాట్లాడాలి. ఆర్ధిక పరంగా మిత్రులకు హామీలు ఇవ్వకూడదు. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం బాగుంటుంది. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘ గౌరవం లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్ధుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో అవివాహితులు పడమర దిశగా వివాహ ప్రయత్నాలు చేయడం వలన కలసి వచ్చును. స్త్రీ లకు నూతన వస్తు - ఆభరణాలు లభించు సూచనలు ఉన్నవి. ఈ మాసంలో శుభ వార్తలు వినుట వలన పోయిన మనోధ్యైర్యం తిరిగి పొందుతారు. ఆశించిన విధంగా దైవం నుండి సహకారం లభిస్తుంది. మొత్తం మీద ఈ మాసం సౌఖర్యవంతంగా ఉంటుంది. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో అనుకూల కాలం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైన జీవనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులు చేస్తారు. నూతన వస్తువులను ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో సౌఖ్యం ఏర్పడుతుంది. ధన సమస్యల నుండి బయటపడతారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కీర్తి పెరుగుతుంది. రాజకీయ పరంగా కూడా ఆశించిన సహకారం లభిస్తుంది. సాంకేతికంగా నూతన పరిజ్ఞానం సంపాదించుకొంటారు. కుటుంబ ప్రయాణాలకు సిద్ధం అవుతారు. ఈ మాసంలో 2, 7, 21, 28, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపెదురు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. దూరప్రాంత జీవన ప్రయత్నాలు విజయమగును. కుటుంబానికి నూతన సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు నూతన వ్యాపార వ్యవహారాలు ప్రారంభిస్తారు. ఆశించిన విధంగానే వ్యవహారాలు కొనసాగుతాయి. పనిచేయు కార్యాలయంలో స్త్రీలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 15 వ తేదీ నుండి 18వ తేదీ మధ్య కాలంలో పాద సంబంధ వ్యాధులకు అవకాసం ఉన్నది. వివాహ ప్రయత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఉద్యోగ జీవనంలో అదృష్ట యోగం ఉన్నది. హోదాలో పెరుగుదల ఆశించవచ్చు. గ్రంధ రచన లేదా ముద్రణా రంగంలోని వారికి ఈ మాసం విశేషమైన ఆర్ధిక లాభాన్ని ఏర్పరచును. ప్రమాదాల నుండి బయటపడతారు. అపోహలు తొలగుతాయి. మనస్తాపం కలిగించే మనుషుల నుండి దూరం కాగలుగుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులకు సహకరించగలరు. నూతన అవకాశముల అన్వేషణ ఫలిస్తుంది. విద్యార్ధులకు మంచి భవిష్యత్ ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఆశించిన పనులు కార్యరూపం దాల్చును. ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనాలలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. నూతన ఉన్నత వర్గీయుల పరిచయాలు ఏర్పడుతాయి. సంతనలేమి దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందును. వ్యక్తిగత జీవితంలో కొద్దిపాటి అననుకుల ఫలితాలు. జీవిత భాగస్వామితో చికాకులు. ధనాదాయం బాగుండును. పెద్దవయస్సు వారికి కుడి నేత్ర సంబంధ సమస్యలు బాధించును. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 కర్కాటకరాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు లాభిస్తాయి. అఖస్మిక శత్రుత్వాలకు అవకాశం ఉన్నది. మాత్రు వర్గీయులకు ఈ మాసం మంచిది కాదు. కోర్టు లావాదేవీలు వ్యతిరేక తీర్పులు పొందును. ప్రేమ వ్యవహారములు మానసికంగా తీవ్ర ఇబ్బందిని కలుగచేయును. ధనాదాయం సామాన్యం. మొత్తం మీద ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.