Placeholder image

2020 - 2021 శ్రీ శార్వరి నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలాలు

Sree Sarvari Nama Samvatsara Dhanur Rasi / Sagittarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 11, రాజపూజ్యం - 06 అవమానం - 03.
  • పూర్వ పద్దతిలో ధనుర్ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాబోయే సంతాన సౌఖ్యాన్ని , గృహ సంబంధ లాభాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Dhanur Rasi / Sagittarius's Sign Nature...

ధనుర్ రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి గురు గ్రహం విదేశీ నివాస లేదా ఉద్యోగ ప్రయత్నాలు మినహా మిగిలిన ఏ విషయంలోనూ అనుకూల ఫలితాలు ఇవ్వడు. ముఖ్యంగా అన్య సంబధాల వలన తీవ్ర సమస్యలు, అపఖ్యాతి, అవమానం ఏర్పరచును. సంతాన ప్రయత్నాలు చేయువారికి విచారం ఏర్పరచును. సుఖలేమి ఎదుర్కొందురు. ఆర్ధికంగా గురువు పెద్దగా ఇబ్బందులు కలుగచేయడు.

ధనుర్ రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ ప్రభావం వలన వైవాహిక జీవనంలో సమస్యలు, కోర్టు గొడవల వలన చికాకులు, అగౌరవం, జీర్ణ సంబంధ, కాలేయ సంబంధ ఆరోగ్య సమస్యలు, ఆర్ధికంగా వృధా ధన వ్యయం వంటి సమస్యలు ఏర్పరచును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని ధనుర్ రాశి వారికి యోగించడు.

ధనుర్ రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన దైవ సంబంధ కార్యములకు ఆర్ధికంగా వ్యయం అధికమగును. సోదర - సోదరి వర్గం వారితో మాట పట్టుదల పెరుగునట్లు చేయును. కోపస్వభావం అధికమగును. వివాహ ప్రయత్నాలు చేయువారికి కష్టములు ఏర్పరచును. శరీర సౌఖ్య లేమి బాధించును. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం ఉన్న వారికి సమస్యల తీవ్రత అధికంగా ఉండును.

మార్చి 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ఏలినాటి శని ప్రభావం వలన సొంత మనుష్యలతో విరోధాలు, శారీరక బాధలు, అవాంచిత కలహాలకు సూచనలు కలవు. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవితంలో మానసిక అశాంతి. భాద్యతలను నేరవేర్చకపోవుట వలన ఉద్యోగ జీవనంలో సమస్యలు. వృత్తి జీవనంలోని వారికి ఆదాయం ఆశించినంతగా ఉండదు. లాటరీలు లేదా స్పెక్యులేషన్ వలన నష్టములు. 2020 మార్చి నెల గంటల పంచాంగం...

ఏప్రిల్ 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామి మూలాన స్థిరాస్తి లేదా సువర్ణ లాభం. ఊహించని విధంగా ఒక తగాదా వలన చికాకులు. వృత్తి వ్యాపారముల వలన సామాన్య ధన సంపాదన. గృహంలో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణాపూర్వక వాతావరణం. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఒత్తిడి , శ్రమ అధికం. మాసాంతంలో వ్యసనాల వలన వృధా వ్యయం. నిర్లక్ష్యం వలన కార్యవిఘ్నత. ప్రభుత్వ వ్యవహారములలో అననుకూలత. ఈ మాసంలో 3, 6, 16, 23 , 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు. 2020 ఏప్రిల్ నెల గంటల పంచాంగం...

మే 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. మీ ప్రమేయం లేకుండా అవమానములు, అపవాదులు భరించవలసి వచ్చును. ధనాదాయం సామాన్యం. రాజకీయంగా ఆసక్తి కలిగివున్న వారికి ఆశించిన పదవులు, ఉన్నత హోదా పొందుటకు ఇది అనువైన కాలం. విదేశీ సంబంధ స్థిర నివాసం కొరకు చేయు ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. తృతీయ వారంలో నిద్రలేమి సంబంధిత ఆరోగ్య సమస్యల వలన సమస్యలు. మాసాంతంలో ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండును. గృహ సంబంధ స్థానచలనం ఏర్పడును. ఈ మాసంలో 8 , 10 , 14, 17 తేదీలు అనుకూలమైనవి కావు. 2020 మే నెల గంటల పంచాంగం...

జూన్ 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడును. వ్యక్త్రిగత జీవనంలో అవిధేయత వలన చికాకులు. ద్వితియ తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ఆఖస్మిక ఇబ్బందులు. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడును. వివాహ ప్రయత్నాలలో అడ్డంకులు. మాసాంతంలో ఆర్ధిక పరంగా కొంత వృద్ది ఏర్పడును. వ్యవసాయ సంభందిత రంగంలోని వారికి తీవ్ర వ్యయం ఏర్పడును. విద్యార్ధులకు ఈ మాసం అంత మంచి కాలం కాదు. విద్యావిఘ్నములను ఎదుర్కోను సూచన. మాసం మొత్తం మీద ధనాదాయం సామాన్యం. 2020 జూన్ నెల గంటల పంచాంగం...

జూలై 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం కొంత వృద్ధి చెందును. వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనాలు బాగానే ఉండును. సంఘంలో చక్కటి పేరుప్రఖ్యాతలు లభించును. ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానములు ఏర్పడును. కుటుంబ సభ్యుల గౌరవం పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. కోర్టు తగాదాలు, వివాహ సంబంధ వివాద విషయములందు లాభములు పొందుతారు. 15, 16, 17, 18 తేదీలలో శుభ వార్తలు వినుదురు. చివరి వారంలో చేయు ప్రయనములందు ఆకస్మిక నష్టం ఏర్పడు సూచన. 2020 జూలై నెల గంటల పంచాంగం...

ఆగష్టు 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసం అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక వలన ఆనందకర సమయం. నూతన కార్యములు ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో కోరుకున్న విధంగా శాంతి. వ్యాపారములు విస్తరించే అవకాశములు లభించును. తృతీయ వారంలో వ్యక్తిగత జీవనంలో సమస్యలు అన్ని తొలగును. చివరి వారంలో . 26, 28, 30 తేదీలలో చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలను కలిగించును. 2020 ఆగష్టు నెల గంటల పంచాంగం...

సెప్టెంబర్ 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం ప్రాప్తించును. భాగస్వామ్య వ్యవహారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి జీవనంలోని వారికి సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఏర్పడును. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. 26, 27, 28 తేదీలలో పెద్ద వయ్యస్కులకు హృదయ సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచన. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. 2020 సెప్టెంబర్ నెల గంటల పంచాంగం...

అక్టోబర్ 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలలో ఊహించని నష్టం. గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండవలెను. ధనాదాయం సామాన్యంగానే ఉండును. ప్రధమ వారంలో ప్రారంభించు వ్యాపారములు విజయవంతం అగును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనంలో సమస్యలు తొలగి ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలూ పొందుతారు. నూతన గృహ లేదా వాహన ప్రయత్నములు ఫలించును. చివరి వారంలో మానసికంగా క్రుంగదీయు ఆలోచనలు అధికంగా ఏర్పడును. ప్రేమకలాపముల వలన తీవ్ర ఇబ్బందులు. పెద్ద వయస్సు వారికి ఆరోగ్య సమస్యలు కొనసాగును. 2020 అక్టోబర్ నెల గంటల పంచాంగం...

నవంబర్ 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో గృహంలో ఒక అశుభ సంఘటన ఏర్పడుటకు సూచనలు అధికం. మానసికంగా తీవ్ర సంఘర్షణ ఎదుర్కొందురు. ప్రశాంతత లోపించును. ఈ మాసంలో ఏర్పడు నూతన పరిచయాలు ఇబ్బంది పాలుచేయును. ముఖ్యంగా మూలా నక్షత్ర యువతులు జాగ్రత్తగా ఉండవలెను. ధన ఆదాయం సామాన్యం. ద్వితియ వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు. మిత్రుల సహాయ సహకారములతో అడ్డంకులను అధిగమించెదరు. మిత్రుల సలహాలు ఉపయోగపడును. మూడవ వారంలో వ్యయం అధికమగు సూచన. ఈ మాసంలో 19, 20, 24 తేదీలు అనుకూలమైనవి కావు. 2020 నవంబర్ నెల గంటల పంచాంగం...

డిసెంబర్ 2020 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో గతకాలపు సమస్యలు కొంత తగ్గును. ఆర్ధిక ఋణముల నుండి విముక్తి లభించును. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించు సూచన. ప్రధమ వారంలో ఆకస్మిక ఆర్ధిక లాభములు ఏర్పడు సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. వ్యక్తిగత జీవన సౌఖ్యం ఏర్పడును. తృతియ వారం విద్యార్దులకు అనుకూలంగా ఉండును. పరదేశ విద్య కోసం చెసే ప్రయత్నాలు లాభించను. గృహంలో బందువుల రాకపోకలు ఉండగలవు. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. గృహ నిర్మాణ సంబంధ మార్పు కోసం చేయు ఫలితాలు ఆటంకములతో ఫలించును. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం బాగుండును. 2020 డిసెంబర్ నెల గంటల పంచాంగం...

జనవరి 2021 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. నివాస గృహంలో దీర్ఘకాలంగా ఆశిస్తున్న అలంకరణ సంబంధ మార్పులు చేయగలుగుతారు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉండును. ప్రతీ వ్యవహారం ఆశించిన మార్గంలో నిదానంగా పూర్తిఅగును. 21వ తేదీ తదుపరి చేయు ప్రయనములందు జాగ్రత్త అవసరం. వాహన ప్రమాద సూచన లేదా ప్రయాణ సంబంధ ఆరోగ్య భంగం కలవు. ఈ మాసంలో 21, 24, 25 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో నల్లని వస్త్రములు ధరించకుండా ఉండుట మంచిది. 2021 జనవరి నెల గంటల పంచాంగం...

ఫిబ్రవరి 2021 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో ధనసంబంధమైన చికాకులు భాదించును. వృధా వ్యయం చేయకండి. ప్రధమ ద్వితీయ వారములలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. కష్టంతో కార్యవిజయం. విరోధుల వలన ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొందురు. పెద్దలకు వైరాగ్య భావన ఏర్పడగలదు. తృతీయ వారంలో కొంత ఒత్తిడి తగ్గును. సంతాన సంబంధ సుఖ సంతోషములు నెలకొనును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు / ఉద్యోగ జీవనంలో మార్పు కొరకు చేసిడి ప్రయత్నాలు సఫలము అగును. ఈ మాసంలో 17 నుండి 23వ తేదీ మధ్య చేయు వివాహ ప్రయత్నములు విజయవంతం అగును. 2021 ఫెబ్రవరి నెల గంటల పంచాంగం...

మార్చి 2021 ధనుర్రాశి రాశీ ఫలితాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ప్రధమ అర్ధ భాగంలో మంచి అనుకూల వాతావరణం ఏర్పడును. కుటుంబంలో చికాకులు తొలగును. పనులు వాయిదా పడకుండా ఆశించిన విధంగా పూర్తీ అగును. భాత్రు వర్గంతో ఘర్షణలు తొలగును. ఆశించిన ధనప్రాప్తిని పొందుతారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా పూర్తీ అగును. గృహంలో బంధు లేదా స్నేహ వర్గ కూడికలు ఏర్పడును. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి శుభం. ద్వితీయ అర్ధ భాగంలో ధన అవసరములు పెరిగి మానసిక ఆందోళన ఏర్పడును. కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారికి అనారోగ్య సమస్యలు. 2021 మార్చి నెల గంటల పంచాంగం...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.